నెటిజన్ తిక్క ప్రశ్న పై శృతి హాసన్ ఇచ్చిన కౌంటర్ ఎంటో తెలుసా?

నెటిజన్ తిక్క ప్రశ్న పై శృతి హాసన్ ఇచ్చిన కౌంటర్ ఎంటో తెలుసా?

హీరోయిన్ శృతి హాసన్ తెలుగు లో ఈ మధ్యే విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది . శృతి హాసన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది.అయితే అటు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది.

శృతి హాసన్ నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్‏లో ఉంటుంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ అభిమానులతో ఇన్ స్టా వేదికగా చిట్ చాట్ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ భామ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో స్పందించగా ఒక నెటిజన్ మాత్రం తిక్క ప్రశ్న వేశాడు.. అయితే దానికి ఆమె నెటిజన్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది..

అయితే ఆ నెటిజన్ నేను మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నాను అంటూ ఓపెన్ కామెంట్ చేయగా… నేరుగా శృతి హాసన్ నో అంటూ చెప్పేసింది . తర్వాత మరో నెటిజన్ ఆర్ యు వర్జిన్ అంటూ తిక్క ప్రశ్న వేశాడు. అయితే వెంటనే ఈ ప్రశ్న పై శృతిహాసన్ సరదాగా స్పందిస్తూ.. ముందు నువ్వు స్పెల్లింగ్ రాయడం నేర్చుకో…అంటూ..

స్పెల్లింగ్ చూడు అంటూ అతడికి గట్టి కౌంటర్ ఇచ్చింది.. అలాగే శృతి తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా తో కలిసి చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఏదేమైనా నెటిజన్లో ఇలాంటి తిక్క ప్రశ్నలు అడిగితే మాత్రం హీరోయిన్లు అందుకు తగ్గట్టుగా సమాధానం చెబుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *