చాలామంది ఆడవారు తమ చర్మం అందంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా ముందు చూడగానే చర్మ సౌందర్యానికి ఆకర్షతులవుతారు. అందుకే అందరూ చూడగానే అందంగా కనపడాలని కోరుకుంటారు. చర్మ సౌందర్యాన్ని బట్టి వయసును కూడా అంచనా వేయొచ్చు. అందంగా కనపడాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
చర్మం మీద మచ్చలు ముడతలు రాకుండా ఉండడానికి ముందుగా ఎండ నుండి చర్మాన్ని రక్షించుకోవాలి. ముఖ్యంగా నీటిని ఎక్కువగాతాగాలి. రోజుకి నాలుగు లీటర్ల నీటిని తాగాలి.ముఖానికి అలోవెరా జెల్, విటమిన్ ఈ ఆయిల్ కలిపి మర్దన చేయాలి. వారానికి ఒకసారి ముఖానికి స్టీమ్ బాత్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో ఉన్న వ్యర్థాలు బయటికి వెళ్తాయి.
ఉదయం పూట స్కిన్ గ్లో కోసం గుమ్మడికాయ పుదీనా,కొత్తిమీర వేసి , జ్యూస్ చేసుకొని తాగాలి. మళ్లీ ఒక గంట తర్వాత క్యారట్ బీట్రూట్ ,టమాటా. ఖీర వేసి జ్యూస్ చేసుకొని తాగాలి. మధ్యాహ్నం ఉడకబెట్టిన ఆహారం కాకుండా పండ్లు తినాలి. సాయంత్రం ఆరంజ్ జ్యూస్ లేదా బత్తాయి జ్యూస్ తాగాలి. దీనిలో ఉండే విటమిన్ సి చర్మం కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది.