మీ ముఖం పై ఒక్క మచ్చ కూడా లేకుండా చేసే అధ్బుతమైన హోమ్ రెమెడీ.

మీ ముఖం పై ఒక్క మచ్చ కూడా లేకుండా చేసే అధ్బుతమైన హోమ్ రెమెడీ.

ప్రస్తుతం మనము తయారు చేసుకునే ప్యాక్ ని ఫీల్ ఆఫ్ మాస్క్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఫేస్ ప్యాక్ ని ఉపయోగించడం వలన ముఖం పై ఉన్న మృత కణాలు తొలగించుకోవచ్చు. ముఖం (ఓపెన్ పోర్స్) పైనున్న రంధ్రాలు కూడా తగ్గేలా చేసుకోవచ్చు. మీ చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలు కూడా తొలగించుకోవచ్చు. ఈ ప్యాక్ లో ఉపయోగించేవి మనకు ప్రకృతి సిద్ధంగా లభించినవి కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ ని ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ప్యాక్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం:

 1. టమాటా
 2. నిమ్మకాయ
 3. కస్తూరి పసుపు
 4. కాఫీ పౌడర్
 5. ఆరెంజ్ ఫీల్ ఆఫ్ మాస్క్ లేదా అలోవెరా జెల్ ఫీల్ ఆఫ్ మాస్క్

  ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం:

  ముందుగా మనం ఒక టమాటా తీసుకొని రెండు ముక్కలుగా చేసి దానిలో ఉన్న గుజ్జు మరియు గింజలను పిండుకోవాలి. ఈ గుజ్జులో ఆరు లేదా ఏడు చుక్కల నిమ్మరసం పిండుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక హాఫ్ స్పూన్ కస్తూరి పసుపు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని అందులో ఒక స్పూన్ కాఫీ పౌడర్ ను కూడా వేసుకోవాలి. అందులో ఆరెంజ్ ఫీల్ ఆఫ్ మాస్క్ లేదా అలోవెరా జెల్ ఫీల్ ఆఫ్ మాస్క్ ను కలుపుకోవాలి.

  ఫేస్ ప్యాక్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం: .

  ముందుగా మీ ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మన ముఖంపై మనం తయారు చేసుకున్న ప్యాక్ ను ఫేస్ పై ఒక లేయర్ గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత 15 నిమిషాలు లేదా 20 నిమిషాల పాటు ప్యాక్ ను డ్రై అవ్వనివ్వాలి. ఫ్యాక్ డ్రై అయిన తర్వాత ఒక గ్లసీగా తయారు అవుతుంది.. ఆ తర్వాత ప్యాక్ ను నెమ్మదిగా కింది నుండి తీసివేయండి.

  ఈ ప్యాక్ ను ముఖంపై ఉన్న వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ తొలగించబడతాయి. మరియు అవాంఛిత రోమాలు కూడా తొలగించబడతాయి. అంతేకాకుండా చర్మం టైట్ గా అయి ముఖం పై ఉన్న ఓపెన్ పోర్స్ కూడా తగ్గుతాయి. ప్యాక్ లో ఉపయోగించిన నిమ్మరసం మరియు టమాటో జ్యూస్ ఫేస్ పై బ్లీచ్ లాగా పనిచేస్తుంది. ముఖం పై ఉన్న మృత కణాలు పూర్తిగా తొలగించబడి మీ ముఖం అందం గా, ప్రకాశవంతంగా మెరుస్తుంది

  Share

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *

  error: Content is protected !!