పాములు నీళ్ళు తాగుతాయా? మీరు ఎప్పుడైనా చూసారా? అవును అని నీళ్ళు తాపీ చూపించాడు.

పాము అంటే భయపడని వారు ఉంటారా ఎవరన్నా? లేదు అని నిరూపిస్తున్నారు ఈ ఐఏఎస్ అధికారి సుశాంత్ నందా. పాములు అంటే ఆమడ దూరం పారిపోయే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అసలు పాములు నీళ్ళు తాగుతాయా అన్న డౌట్ చాలా మందికి ఉంటది, ఈ అధికారి పాముకి నీళ్ళు తాపించి చూపించారు.

ఈ ఐఏఎస్ అధికారి పాముకి నీళ్ళు తాపిన విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు బిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.వర్షాకాలంలో అయితే ఇక్కడ చూసిన పక్షులకు, జంతువులకు, అన్ని రకాల జీవులు ఏదో విధంగా ఎక్కడో నీళ్ళు లభిస్తాయి. ఎండాకాలం వచ్చే సరికి అవి ఇంకిపోయి నీటి జాడ కూడా లేకుండా పోతాయి.

ఈ ఐఏఎస్ అధికారి మాత్రం ఈ వీడియోతో పాటుగా కొన్ని విషయాలు చెప్పారు, ఈ ఎండాకాలంలో ప్రతి జీవికి నీళ్ళు దొరకడం కష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ జీవులకు నీరు దొరికేలా ఇంటిపై ఏర్పాటు చేయండి అని చెప్పారు.