రాత్రిళ్ళు నిద్ర రాక సతమతం అవుతున్నారా అయితే ఈ చిన్న రెమెడీ తో మీ సమస్యను దూరం చేస్కోండి.

రాత్రిళ్ళు నిద్ర రాక సతమతం అవుతున్నారా అయితే ఈ చిన్న రెమెడీ తో మీ సమస్యను దూరం చేస్కోండి.

ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్ర లేమి సమస్య తో బాధపడుతున్నారు. అయితే రాత్రిళ్ళు నిద్ర రాక సతమతమవుతున్నారా, వేలకు వేలు ఖర్చు పెట్టి అలసి పోయారా ఆయితే వేడి పాలల్లో ఇది ఒక స్పూన్ వేసుకోని చూడండి, మంచం ఎక్కగానే నిద్ర వద్దన్న వస్తుంది.

రెమెడీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • 200 గ్రాముల ఎండు ఖర్జూరాలు
  • 100 గ్రాముల బాదం పప్పు
  • 50 గ్రాముల గుమ్మడి గింజలు
  • 25 గ్రాములు గసగసాలు
  • పాలు

ముందుగా మనం ఎండు ఖర్జూరాన్ని తీసుకోని ఎండు ఖర్జూరం ముక్కలు చేసి ఒక 200 grams తీసుకోవాలి. గింజలు తీసిన ముక్కలను మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. దానిని ఒక గిన్నెలో వేసుకోండి. తరువాత 200 గ్రాముల ఎండు ఖర్జూర పొడి, 100 గ్రాముల బాదంపప్పు నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. బాదం పౌడర్ ని కూడా ఎండు ఖర్జూరం పౌడర్లో వేయండి. వీటితో పాటు గా ఒక 50 గ్రాములు గుమ్మడి గింజలను కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అన్నీ ఎండు ఖర్జూరం 200 గ్రాములు, బాదం పప్పు 100 గ్రాములు, గుమ్మడి గింజలు 50 గ్రాములు, 25 గ్రాముల గసగసాలు, వీటన్నింటినీ వేరువేరుగా మిక్సీ పట్టుకొని అన్ని పౌడర్లను కలపాలి.

అన్నీ ఒకే గిన్నెలో వేసుకొని అన్నీ కలిసేలా చేసుకోవాలి.ఈ విధంగా తయారు చేసుకున్న పౌడర్ ని అన్నం తిన్న తర్వాత పడుకోవడానికి అరగంట ముందు, వేడివేడి పాలలో కలుపుకొని తాగడం వలన నిద్ర రాక బాధ పడే వారు ఎంచక్క నిద్రపోవచ్చు. అయితే ఈ రెమెడీ వాడటం వలన డాక్టర్ల దగ్గరికి వెళ్లి వాళ్ళ చుట్టూ తిరిగి, మందులు వాడే బాధ తగ్గుతుంది. ఈ విధం గా తయారు చేసకొన్న పౌడర్ ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవచ్చు. మీ ఈ సమస్య ఎక్కువగా ఉంటే దీని రిసల్ట్ కనీసం రెండు మూడు రోజులు పడుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *