మొక్కజొన్న(Sweet Corn)లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా మీకు?

మొక్కజొన్న(Sweet corn) గింజల్లో ఎముకలకు అత్యంత అవసరమైన మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి. మానవ శరీరంలో ఎముకల పాత్ర చాలా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండేలా చేసేందుకు మొక్కజొన్న (Sweet corn) లో ఉండే రాగి, ఐరన్ వంటి పదార్థాలు ఉపయోగపడతాయి. మొక్కజొన్న గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయి. కనీసం వారానికి రెండు సార్లు తినే ఆహారంలో ఈ గింజలను చేర్చుకుంటే చర్మం పై ముడతలు, చర్మ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

మొక్క జొన్న (Sweet corn) గింజలు వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. వీటిని నేరుగా తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అత్యంత తక్కువ ధరలో దొరికే ఆహారాలలో ఇది కూడా ఒకటి. మొక్క జొన్నలను ఉడికించి, వేయించి తినవచ్చు మరియు పాప్‌కార్న్‌(pop corn) లా తయారు చేస్కొని తినవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది రాత్రి సమయంలో మొక్క జొన్న పిండి తయారు చేసిన రొట్టెలను ఆహారంగా ఉపయోగిస్తున్నారు. మొక్క జొన్నలను పిండి చేసి దానితో రొట్టెలు గా కాల్చుకొని తిన్నట్లైతే చాలా రుచిగా ఉంటాయి.

మొక్కజొన్న (Sweet corn) గింజల్లో ఫోలిక్ యాసిడ్‌(Folic acid) కూడా లభిస్తుంది. ఫోలిక్ యాసిడ్ రక్తహీనత సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గుండెపోటు(Heart stroke) మరియు అధిక రక్తపోటు(Blood pressure)ను నివారించడానికి కూడా చాలా సహాయపడుతుంది అని చెప్పుకోవచ్చు. మొక్కజొన్నలను రోజూ ఆహారంలో తిసుకుంటే జుట్టు(Hair) చాలా అందంగా దృఢంగా మారుతుంది.

మొక్కజొన్న (Sweet corn) లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియకు చాలా సహకరిస్తాయి. మొక్కజొన్నలు తినడం వలన మలబద్ధకం మరియు మొటిమల(Pimples)ను కూడా నివారించుకోవచ్చు. మొక్క జొన్నల్లో.. లినోలిక్ అనే యాసిడ్ ఉంటుంది. ఇందులో బి-6, బి-1, విటమిన్ ఇ మొదలైనవి అధికంగా ఉంటాయి. మొక్క జొన్నలు పేగు సమస్యలను నివారించడంలో కూడా చాలా బాగా సహాయపడుతాయి.

(Disclaimer: The information and information provided in this article are based on general information. fbhealthy does not confirm these. Please contact the relevant expert before implementing them.)