తిప్పతీగ తెలియని ఊరు మనిషి ఉండరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. తిప్పతీగ పల్లెలలో దొరికే గొప్ప మూలిక అని చెప్పవచ్చు. అయితే ఈ తీగ ను హిందీలో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని కూడా పిలుస్తారు. తిప్పతీగ పాకే గుణం కలది కాబట్టి ఇది ఈసీ గా చెట్ల మీదకు పాకీ అల్లుకుపోతుంది. ఈ తీగ ఆకులు చూడటానికి చిన్నవిగా తమలపాకు లాగా కనిపిస్తాయి.. ఈ ఆకు నమిలితే జిగటగా కాస్త వగరు చేదు కారం రుచిని కలగలిపి ఉంటాయి. ఈ తీగ యొక్క విశేషం ఏమిటంటే మొత్తం వేరుని భూమి నుండి తీసి పడేసిన తర్వాత కొంచెం తడి తగిలినా ఆరు నెలలైనా సరే తిరిగి ఇగురు వేసే గుణం ఉంటుంది.
ఇలాంటి అద్భుత ఔషధ మూలిక రాను రాను కనుమరుగు అయిపోతుంది. దీని గురించి చెప్పేవారు దీని లాభాలు చెప్పేవారు ఇప్పుడు అస్సలు లేరు. ఇక ఈ తిప్పతీగను తులసిని కలిపి తీసుకుంటే స్వైన్ ఫ్లూని ఎదిరించే రోగనిరోధకశక్తి శరీరానికి చేకూరుతుందని ఒక వేల స్వైన్ ఫ్లూ వచ్చిన కానీ తగ్గించగలిగే దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు.. ఈ మంచి విషయాన్ని ప్రసిద్ద ఆయుర్వేద పరిశోధకులు, యోగా గురువు, రాందేవ్ బాబా గారు వ్యాధి నివారణకు మందుగా సూచించారు.
ఈ తిప్పతీగ కాడలను 1 లేదా 2 అంగుళాల ముక్కను పది తోలసి ఆకులతో కలిపి ఉదయాన్నే నమిలితినడం వలన స్వైన్ ప్లూ ని అరికట్టవచ్చు. అయితే ఈ ఆకు ను నాలుగైదు రోజులకొకసారి తీసుకోవాలి. స్వైన్ ప్లూ వ్యాధి సోకినప్పుడు ఎక్కువ మోతాదులో తీసుకొంటే అద్భుతంగా ఔషదం లా పనిచేస్తుంది. అయితే ఈ తిప్పతీగ ఆయుర్వేదం లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ గొప్ప ఔషధ చెట్టును ఉపయోగించి జ్యూస్, పౌడర్ మరియు క్యాప్సిల్స్ తయారు చేసి అమ్ముతారు. మధుమేహ భాదితులు కూడా తిప్పతీగ ను కషాయం లా గా చేస్కొని తాగడం వలన కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.
అజీర్తి సమస్య తో బాధపడే వారు తిప్పతీగ తో తయారు చేసిన మందులు వాడితే మంచి ఉపశమనం లభిస్తుంది. తిప్ప తీగ పొడిని బెల్లంలో కలుపుకొని తీసుకోవడం వలన అజీర్తి సమస్యను నుండి బయట పడవచ్చు. కీళ్ల నొప్పులతో భాదపడే వారు వేడి పాలల్లో కొంచెం తిప్పతీగ పొడిని కలుపుకొని తాగడం వలన ఆర్థరైటిస్ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. అంతే కాకుండా తిప్పతీగ ముఖం పై వృద్దాప్య ఛాయలు రాకుండా చేయడం లో చాలా బాగా ఉపయోగపడుతుంది.
