తెల్లని కాంతివంతమైన చర్మం కోసం ఇంట్లోనే ఈ చిన్న రెమెడీ.

ఎండాకాలం మొదలయ్యాక ఎవ్వరి చర్మం చూసిన చెమట తో ముఖం మొత్తం నల్లగా మారిపోయి పాలిపోయినట్లు గా కనపడుతుంది. నిస్తేజంగా మారిన ముఖాన్ని మెరిసేలా చేయడం కోసమే ఈ సరికొత్త ప్యాక్ మీ కోసమే. మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ ప్యాక్ సులభంగా చేసుకోవచ్చు.

కావలిసిన పదార్థాలు:

  1. పెరుగు
  2. శనగ పిండి
  3. పసుపు

ఒక కప్పులో ముఖానికి పట్టించడానికి సరిపడా శనగ పిండి తీసుకోండి. దానిలో ఒక స్పూన్ పసుపు, సరిపడా పెరుగు వేసుకొని దాన్ని పేస్ట్ లా తయారు చేయండి. ఈ తాయారు అయిన పేస్ట్ ని ముఖం పై అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయండి.

ముఖంపై ప్యాక్ ఆరిపోయాక నెమ్మదిగా చల్లని నీటితో ముఖం ని కడిగేసుకోవాలి. పెరుగు లోని ల్యాక్టిక్ యాసిడ్ చర్మం పై మృతకణాలు తొలగించి ముఖం కాంతి వంతంగా కనపడేలా చేస్తుంది. మరియు శనగ పిండి చర్మం యొక్క రంగుని పెంచుతుంది.

ఈ విధంగా ఇంట్లోనే దొరికే వస్తువులతో వారానికి రెండు సార్లు వాడినట్లైతే మీ తెల్లగా, యంగ్ లుక్ తో కనపడేలా చేస్తుంది.