వామ్మో వీడు మామూలు వాడు కాదు..!

పరీక్షల సమయంలో చాలా మంది విద్యార్థులు పరీక్షల సమయంలో తీవ్రమైన ఒత్తిడి కి గురవుతుంటారు. పరీక్షల్లో చదివిన విషయాలు రాకపోతే ఫెయిల్ అవుతారు అనే భయంతో చీట్ చేసి ఎక్సామ్ రాయాలి అనుకుంటారు. పరీక్షలో ఫెయిల్ అవుతాము అని బాధపడే వారు ఇలాంటి పనులు చేస్తుంటారు.

ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అందుకు అనుగుణంగా విద్యార్థుల ప్రణాళికలు మారుతున్నాయి. పరీక్షల్లో కాపీ కొట్టేందుకు విద్యార్థులు చాలా తెలివిగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మెయిన్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షకు హాజరు అవుతున్న విద్యార్థులను గెట్ వద్ద చెక్ చేసి ఎక్సామ్ హాల్ లోకి పంపిస్తున్నారు. ఇంతలోనే ఒక అభ్యర్థి హడావుడి గా వచ్చాడు.

అతన్ని సెక్యూరిటీ తనిఖీ చేస్తే తల మీదకు డిటెక్టర్ రాగానే సౌండ్ వస్తుంది. ఎక్కడ చూసిన ఏం కనిపించడం లేదు.చెవిలో కూడా ఎలాంటి బ్లూటూత్ లేదు. అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చూడాగా అతడి తల మీద ఉన్నది విగ్గు. విగ్గు జాగ్రత్తగా తీసేసి చూసి షాక్ అందులో సిమ్, బ్యాటరీ మరియు కొన్ని వైర్లు ఉన్నాయి. అతను వాటిని చెవికి దగ్గరగా ఉండేలా అమర్చాడు.

రెండు చెవులకు కూడా చిన్న ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకున్నాడు అయ్యాడు. ఈ విషయానికి సంబందించిన వీడియొ అక్కడి ఐపిఎస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో @ rupin1992 పోస్ట్ చేశారు.