సోదరి అత్తారింటికి వెళ్ళేపుడు ముళ్ళకంపపై పడుకొని దొరిలే వింత ఆచారం ఎక్కడో తెలుసా?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని లోని బైతుల్ జిల్లా సెహెరా గ్రామంలోని రజ్జడ్ తెగ ప్రజలు పాటిస్తున్న ఈ వింతైన ఆచారం వెలుగులోకి వచ్చింది. మన భారతదేశంలో ఎన్నో రకాల ప్రజలు నివసిస్తున్నారు. ఎన్నో రకాల ఆచార వ్యవహారాలు కలిగి ఉన్నారు. వాటికి సంబంధించిన వారే ఈ రజ్జడ్ తెగ ప్రజలు. వీరు పాండవుల వారసులని వీరి నమ్మకం.

ఈ తెగ కు సంబంధించిన ప్రజలు వాళ్ళ ఇంటిలో సోదరి పెళ్లి అయితే ముళ్ళకంప పై పడుకొని దొరలుతారు. ఈ ఈ ఆచారం చాలా ప్రమాదకరమని ఎవరైనా చెప్పినా ఈ తెగ ప్రజలు పట్టించుకోరు. వారు పాండవుల వంశానికి చెందిన వారని వారిలోని నిష్టను చాటుకుంటామని చెప్తున్నారు.

పెళ్లయిన సోదరికి వీడ్కోలు పలకడం కోసం ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ తెగ ప్రజలు వారి పూర్వీకుల నుండి వచ్చిన ఈ ఆచారాన్ని వదులుకోమని ఈ ఆచారం పాటించడం వలన దేవుడు వారిని చల్లగా చూస్తాడని వారు నమ్ముతారు.