అందమైన నాజూకు శరీరం కోసం ఈ చిన్న టిప్ పాటించండి చాలు.

అందమైన నాజూకు శరీరం కోసం ఈ చిన్న టిప్ పాటించండి చాలు.

అందానికి ప్రతి రూపం ఎవరు అంటే స్త్రీ అనే చెప్తాము. ప్రతి స్త్రీ అందంగా, ఆరోగ్యం గా ఉండాలి అని కోరుకుంటుంది. ఈ రోజుల్లో అయితే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి మహిళా అందం కోసం పార్లర్ ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కొంత మంది మహిళలు మాత్రం అందం అంటే నాజూగ్గా (సన్నగా)ఉండాలి అనే భావన లో ఉన్నారు. నాజూకు అయిన శరీరం కోసం చాలమంది మహిళలు కడుపు మాడ్చుకొని, పస్తులుంటూ నీరసం వచ్చి చివరకి ప్రాణం మీదకి కూడా తెచ్చుకుంటున్నారు.ఇక అసలు విషయానికి వస్తే నాజూకు అయిన శరీరం కోసం ఎలా పస్తులు ఉండాలా? ఆహారం మానేయడం వలన సన్నగా తయారు అవుతారా?

ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బరువు పెరగకుండా సన్నగా నాజూకుగా తయారు అవుతారో చూద్దాం. ముందుగా ఆహార విషయాలలో కొన్ని మార్పులు చేయాలి కానీ వాటిని ఒక్కసారిగా కాకుండా క్రమేణా మీ డైట్ లో మార్పును తెస్తూ ఉండాలి. ఇక మీరు సన్నగా అవ్వాలి అని డైట్ ను తగ్గిస్తూ వస్తే మీకు వచ్చేది నీరసం,ఆకలి, అలసట లు వస్తాయి. ఇలాంటివి రాకుండానే ఆరోగ్యంగానే సన్నపడొచ్చు. మీరు సన్నపడాలి అన్న ఆలోచన లో పస్తులు(సరిగా ఆహారం తీసుకోకపోవడం) మీకు వచ్చే ఫలితం తల నొప్పి, ఏ పనిమీద శ్రద్ధ లేకపోవడం, ద్రుష్టి లోపించడం వంటివి వస్తాయి.. మీరు మీ శరీర బరువు తగ్గాలనుకుంటే ఆత్రుతను పక్కన పెట్టి నెమ్మదిగా చర్యలు ఆరంభించాలి.

అయితే మీరు మొదటగా చేయాల్సింది ఏమిటి అంటే ప్రతి ఉదయం క్రమం తప్పకుండా ఒకే సమయానికి నిద్ర లేవాలి. మీరు మొదట్లో ఒక 20 నిమిషాల పాటు వాకింగ్ చేయడం మొదలు పెట్టాలి, ఈ వాకింగ్ క్రమంగా రోజు ఒక 5 నిమిషాలు పెంచుతూపోవాలి. అలా చేస్తూ శరీరానకి రెండు గంటల కు ఒక సారి ఆహారాన్ని ఇవ్వాలి. ఆ తరువాత నెమ్మదిగా ఆహర పరిమాన్ని తగ్గిస్తూ మీ శరీరం అలవాటు పడేలా చేయాలి. అప్పుడు మీ శరీరం అనారోగ్యం పాలవకుండా ఎల్లపుడూ ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది తినే సమయంలో టీవి చూస్తూ ఆహరం తీసుకుంటారు. ముందుగా ఆ అలవాటు మానేయండి. ఈ అలవాటు మిమ్మల్ని అధిక ఆహరం తినెలా చేస్తుంది.

ఇక ఆహారం తీసుకునే సమయంలో వీలైనంత వరకు ఒంటరిగా కాకుండా అందరితో కలిసి తినండి. అందరితో కలిసి తినే విధానంలో తక్కువ ఆహారం తీసుకుంటారు. మీరు కడుపు మాడ్చుకునే ప్రక్రియలో చాలా మంది బరువు తగ్గుతారు కానీ అది శరీరంలోని నీటిని మాత్రమే తీసేస్తుంది. కానీ అలా చేయడం చాలా తప్పు మళ్ళీ త్వరగా బరువు కూడా పేరుగుతారు. ముఖ్యంగా సమయ నియమాన్ని పాటించండి. పర్ఫెక్ట్ ఫిగర్ అంటే సన్నగా నాజూకు గా కనిపించడం అనే భ్రమ నుండి మీ ఆలోచన ని మార్చుకోండి. ఈ చిన్న టిప్స్ పాటిస్తూ మీ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *