మీ జుట్టు పట్టు లా మెరావాలి అన్నా, మీ  చుండ్రు సమస్య చిటికలో పోగొట్టుకోవాలి అనుకున్న ఈ చక్కటి రెమెడీ చేసి చూడండి.

మీ జుట్టు పట్టు లా మెరావాలి అన్నా, మీ చుండ్రు సమస్య చిటికలో పోగొట్టుకోవాలి అనుకున్న ఈ చక్కటి రెమెడీ చేసి చూడండి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జుట్టు సమస్య కనపడుతుంది. అయితే ఈ సమస్య ముఖ్యంగా వాతావరణం అతి వేడిగా ఉన్నా, అతి చల్లగా ఉన్నా జుట్టు పైనే ఎంతో ప్రభావం చూపుతుంది. ఇక వేడిగా ఉన్నపుడు అంటే ఎండాకాలంలో సమయంలో కంటే శీతాకాలంలో కురులని (జుట్టుని) సంరక్షించుకోవడం చాలా కష్టమైన విషయం. అయితే చలి కాలంలో చుండ్రు సమస్య అందరినీ ఎక్కువగా బాధిస్తుంది. తల అంతా ఒకటే దురదగా అనిపిస్తుంది.ఎన్ని సార్లు తల స్నానం చేసినా అంతగా ప్రయోజనం కనిపించదు. ఇక మన తల పొడిగా మారడం వలన చుండ్రు తెల్లగా భుజాల మీదకు రాలడం, మరియు జుట్టు కూడా కుదుర్ల నుండి రాలి భుజాల పై పది ఎంతో అసహ్యంగా కనిపిస్తుంది..

చుండ్రు సమస్య కు ఏం చేయాలో చూద్దాం:

తల స్నానం చేయడానికి ఒక గంట ముందుగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె ను గోరు వెచ్చగా చేసుకోవాలి. ఆ తరువాత గోరు వెచ్చని అందుబాటులో ఉన్న నూనె ను తీసుకొని తలపై నూనె తో బాగా మర్దన చేయాలి. ఆ తరువాత ఎప్పటిలాగానే షాంపూ తో కడిగేసుకోవాలి. షాంపూ వాడకం కూడా తగ్గిస్తే ఈ చుండ్రు సమస్య నుండి త్వరగా బయట పడవచ్చు. షాంపూ వాడకం అంటే వారానికి మితంగా ఒకటి మరియు రెండు సార్లు మాత్రమే షాంపూ చేసుకుంటే మంచిది. ఇక ఇవే కాకుండా మీరు తినే ఆహారం లో కూడా చిన్న చిన్న మార్పులు చేయడం వలన కూడా చుండ్రు సమస్య నుండి విముక్తి పొందవచ్చు. అధికంగా విటమిన్ లు , పోషక విలువలు లభించే తాజా కూరగాయలు.. పండ్లు..నట్స్, ప్రోటీన్స్, ఫ్యాటీ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల చుండ్రుకు కారణమయ్యే ఇతర సమస్యలను అరికడుతూ..తలలో ఇన్ఫ్క్షన్స్, బాక్టీరియాను నివారిస్తాయి. అయితే.. షుగర్, హై ఫ్యాట్ ఫుడ్స్ కి దూరంగా ఉంటేనే చుండ్రు నివారణలో ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది.

షాంపూ ఎంపిక లో చాలా మందికి చాలా సందేహాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా అలాంటి వారు షాంపూ లో టీ ట్రీ ఆయిల్, జింక్, విటమిన్ బి, ఒమేగా 3,ఫ్యాటీ యాసిడ్స్, కలిగి ఉన్న షాంపూలే ఎంపిక చేసుకోవాలి. వీరు ఈ షాంపూ ని క్రమం తప్పకుండా కొన్ని నెలలు వాడితే వారి చుండ్రు సమస్య పూర్తిగా పోతుంది. ఇక ఈ విధంగా నూనె మర్ధనా మరియు మంచి షాంపూ ఎంపిక చేస్కోవడం తో పాటు సూర్యరశ్మి నుండి మన శరీరానికి విటమిన్ డి లభిస్తుంది కదా అని అతిగా ఎండలో తిరగకూడదు. వీలైనంత వరకు చుండ్రు సమస్య ఉన్నవారు ఎండలో తిరగకపోవడమే చాలా మంచిది. ఒక వేళ మీరు ఎండలో కానీ పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగాల్సి వస్తే ముఖ్యంగా తలకి క్యాప్ లేదా స్కార్ఫ్ ధరించి వెళ్ళాలి. చాలా మంది జుట్టు కి జెల్స్ వాడుతుంటారు వాటి ఎంపిక లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్కాహాల్ కలిసిన హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులకు దూరంగా ఉంటేనే మంచిది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!