దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని ఢిల్లీలోని ఎయిమ్స్ న్యూరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం.వి.పద్మ శ్రీవాస్తవ అన్నారు. రోజూ 20కి పైగా బ్లాక్ ఫంగస్ కేసులు వస్తున్నాయని డాక్టర్ చెప్పారు. What is the black fungus, its an virus or not -fbhealthy.com
Alsoread: మీ మొబైలు, డెస్క్‌టాప్ లో ఈ పాస్వవర్డ్స్ వాడుతున్నారా?మిత్రమా జాగ్రత్త..!
బ్లాక్ పంగస్ అనేది వైరస్ కాదు. అలాగే అంటువ్యాధి కూడా కాదు. ఇది కొంతమందికి మాత్రమే వచ్చే వ్యాధి. ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నవారికీ, కరోనా తగ్గి ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య వస్తోంది. దీనికి మందులు, చికిత్స ఉన్నాయి. ముఖ్యంగా ఇది వెంటనే ప్రాణాలను హరించే వ్యాధి కూడా కాదు” అని ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్ పీవీ సుధాకర్ అన్నారు. What is the black fungus, its an virus or not -fbhealthy.com
Alsoread: ఇది చేస్తే మీకే రిస్క్….హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఈ తప్పులు చేయకండి.
కోవిడ్ చికిత్స సమయంలో అధికంగా స్టెరాయిడ్ వాడటం, ఆక్సిజన్ అందించేప్పుడు పరికరాలు పరిశుభ్రంగా లేకపోవడం కూడా ఈ వ్యాధికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.ఆక్సిజన్ అందించే ప్రక్రియలో ఉపయోగించే హ్యుమిడిఫయర్‌లో స్టెరైల్ వాటర్‌కు బదులుగా సాధారణ నీటిని ఉపయోగించడం వలన ఫంగస్ ఏర్పడుతుంది. ఆక్సిజన్‌తో పాటు ఈ ఫంగస్ కూడా చేరడం వలన కోవిడ్ పేషెంట్లు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. What is the black fungus, its an virus or not -fbhealthy.com
Alsoread: ఈ కోవిడ్ సమయంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారం!