మహిళలో గర్భాశయ కాన్సర్ నిరోధించడానికి ఆవాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఆవాలు తెలియని వంటింటి గృహిణి ఉండదు. చాలా మంది ఏ కూర వండిన దాదాపుగా ఆవాలను దానిలో బాగంగా చేరుస్తారు. కొంత మంది ఆవాలను చూడగానే ఒళ్ళు విరుస్తారు, తింటుంటే ఏదో విధంగా పళ్ళకు తగులుతాయి అని కూరలో వేయడం మానేస్తారు.

ఆవాలు స్త్రీ లకు చాలా బాగా ఉపయోగపడతాయి, మహిళల్లో ఎక్కువగా వచ్చే గర్భాశయ కాన్సర్ ను నిరోధించడంలో ఆవాలు చాలా మంచి ఉపయోగకరంగా ఉంటాయి. ఆవాలు రకాల కలర్ లలో లభిస్తున్నాయి.

ALSO READ: వేసవిలో పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా మీకు?

నల్ల ఆవాలు ఒక రకం అయితే రెండవ రకం పసుపు రంగులో ఉంటాయి, మూడవ రకం తెల్ల ఆవాలు. నల్ల తెల్ల ఆవాలలో కంటే పసుపు ఆవాలలో అదనపు పోషకాల కారణంగా ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్స్ , అలాగే బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.

ఆవాలలో ఉండే గ్లూకోసినోలైట్స్ అనే ముఖ్యమైన ఫైటో కెమికల్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడి కాన్సర్ కణాలను నిరోధించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. పసుపు ఆవాలు గర్భాశయ మరియు ప్రేగులకు సంబంధించిన కాన్సర్ లను నిరోధించడంలో చాలా బాగా పనిచేస్తాయి. ఆవాల్లో ఉండే మెగ్నీషియం జీవక్రియ రేటు ను పెంచడంలో మంచి పాత్ర పోషిస్తుంది.

ALSO READ: వేసవి కాలంలో స్నానం చేయు సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఎంటో తెలుసా?