Radhika Merchant | ఇంటి పేరు మార్చుకున్న అంబానీ కోడలు:
రిలయన్స్ కంపెనీ అధినేత, ప్రపంచ కుబేరుడు అయిన ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగవైభంగా జరిగిన విషయం మీకు తెలిసినదే. ఈ ఏడాది 2024, జులైలో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్(Radhika Merchant) వివాహం జరిగింది. ఈ వివాహ వేడుక తో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లు ఇద్దరు ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుక అంబానీ ఇంట మూడు రోజులపాటు జరిగినది.
ఈ వివాహ వేడుకకు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, చలన చిత్ర మరియు ఇతర రంగాల్లోని ప్రముకులు తరలివచ్చారు. ముంబయి నగరం లోని వీధులన్నీ ఒక్కసారిగా అతిథులతో నిండిపోయాయి. ఈ పెళ్లి వేడుకకు దాదాపు 2500 మంది ముఖ్యఅతిథులుగా వచ్చినట్లు అంచనా.. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీలు అంబానీ ఇంట పెళ్లిలో తెగ సందడి చేశారు. ఇక అసలు విషయానికి వస్తే ఇన్నాళ్లకు రాధికా మర్చంట్(Radhika Merchant) అధికారింగా అంబానీ కుటుంబంలో కలిసిపోయారు.
అదేంటి వివాహంతోనే అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు కదా అని అనుకుంటున్నారా? మీరు అనేది నిజమే అయినా..చాలా వరకు మన దేశంలో పెళ్లి తర్వాత అమ్మాయిలకు అత్తవారి ఇంటి పేరు వస్తుంది. అదే సంప్రదాయాన్ని కొనసాగించారు రాధికా మర్చంట్. తాజాగా తన పేరులో మర్చంట్ స్థానంలో అంబానీగా మార్చుకున్నారు. ఇప్పుడు రాధికా మర్చంట్(Radhika Merchant) కాదు.. రాధికా అంబానీ గా అధికారికంగా తన పేరులో మార్పు చేసుకున్నారు. అధికారికంగా తన ఇంటి పేరును అంబానీగా మార్చుకున్నారు రాధికా. ప్రస్తుతం రాధికా మర్చంట్ పేరు మార్చుకున్న విషయంపై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb