ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన నరాలు సరిగ్గా పనిచేయడానికి, మెదడు కణాలు కుశించిపోకుండా ఉండడానికి, ముఖ్యంగా ముసలితనంలో కూడా బ్రెయిన్ హెల్త్ కాపాడటానికి చాలా కీలకమైన పోషక పదార్థం. చాలామంది దీని మూలం చేపలేనని భావిస్తారు, కానీ వాస్తవానికి చేపల్లో ఒమేగా-3 కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, 100 గ్రాముల చేపలో కేవలం 200 నుంచి 300 మిల్లీగ్రాముల వరకు మాత్రమే ఒమేగా-3 ఉంటుంది.
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!
మన శరీరానికి రోజుకి సుమారు 1.6 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అవసరం అవుతుంది. అంటే రోజూ సగం కిలో చేప తినకపోతే ఆ అవసరాన్ని తీర్చడం కష్టమే. కానీ చేపల కంటే చాలా చవకగా, సులభంగా దొరికే వనరుగా వాల్నట్స్ (అక్రోట్స్) ఉంటాయి. రోజుకు నాలుగు లేదా ఐదు వాల్నట్స్ తింటే చాలు — అవి సుమారు 15–20 గ్రాముల బరువులో ఉంటాయి, అందులోనే మన శరీరానికి కావలసిన 1.7 గ్రాముల ఒమేగా-3 లభిస్తుంది.
Cloves | లవంగం తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.
ముఖ్యంగా వృద్ధుల కోసం ఇది ఎంతో ప్రయోజనకరం. రోజూ రాత్రి నాలుగు లేదా ఐదు వాల్నట్స్ నీటిలో నానబెట్టి, ఉదయం మొలకలు లేదా పండ్లు తినేటప్పుడు వాటిని తీసుకోవచ్చు. ఈ వాల్నట్స్లో ఉండే మంచి కొవ్వులు బ్రెయిన్ ఆకారంలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచి, నరాల వ్యవస్థను బలపరుస్తాయి. మతిమరుపు, నరాల బలహీనత, మెదడు కణాల క్షీణత వంటి సమస్యల నుండి రక్షణ ఇస్తాయి.
అందుకే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అందించే వాల్నట్స్ను మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోండి. ముసలితనంలో మెదడు చురుకుగా, నరాలు బలంగా ఉండటానికి ఇది సహజమైన అద్భుత మందు.
టెస్టోస్టెరాన్ స్థాయి పెంచే సహజ ఆహారాలు మరియు చిట్కాలు.