మగవారిలో టెస్టికల్స్ (వృషణాలు) భాగంలో దురద, పొక్కులు, చర్మం మందగడం, దుర్వాసన వంటి సమస్యలు చాలామందికి సాధారణంగా ఎదురవుతుంటాయి. ఈ సమస్యలు ఎందుకు వస్తాయో, వాటికి సహజ పరిష్కారాలు ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం.
చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ – పటాన్‌చెరులో విషాద ఘటన.
కారణాలు:
- టైట్ అండర్వేర్స్ వాడకం
చాలా మంది మగవారు టెస్టికల్స్ జారకుండా ఉండేందుకు టైట్‌గా ఉండే అండర్వేర్స్ వాడుతారు. ఇవి గాలి ఆడనివి కావడంతో ఆ భాగంలో చెమటలు ఎక్కువగా పట్టి, చర్మం వేడెక్కుతుంది.
ప్రోటీన్ ను బాగా అందించే ఈ పిండి ముక్క గురించి తెలుసుకుందాం.
- గాలి ఆడని దుస్తులు
జీన్స్, మందపాటి ప్యాంట్లు లేదా సిల్క్ ప్యాంట్లు వంటివి వాడితే టెస్టికల్స్ భాగంలో గాలి సరైనంతగా చేరదు. దీంతో చెమట నిల్వై బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి.
- స్వచ్ఛత లోపం
ఉదయం స్నానం చేసిన తర్వాత రోజు మొత్తం బయట ఉంటారు. మధ్యలో ఆ భాగాన్ని శుభ్రం చేయకపోవడం వల్ల చెమట నిల్వై బ్యాక్టీరియా పెరుగుతాయి. ఈ పరిస్థితిలో దురద, పొక్కులు, దుర్వాసన వంటి సమస్యలు వస్తాయి.
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!
- చర్మం మీద పేరుకుపోయిన చెమట మరియు బ్యాక్టీరియా
సాయంత్రం స్నానం చేసే సమయానికి టెస్టికల్స్ భాగంలో మట్టి లా ఉండే పదార్థం కనిపిస్తే, అది అసలు మట్టి కాదు – చెమటలో పెరిగిన బ్యాక్టీరియా పొర.
నివారణ మరియు పరిష్కారాలు:
- రోజూ స్నానం తర్వాత శుభ్రం చేయడం
సబ్బుతో మాత్రమే కడగడం సరిపోదు. కాళ్లు రుద్దుకునే సాఫ్ట్ బ్రష్‌ను తీసుకుని ఆ భాగాన్ని మృదువుగా శుభ్రం చేయాలి. ఇది చర్మపు ఫోల్డ్స్ లోపల కూడిన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. - కొబ్బరి నూనె ఉపయోగించడం
స్నానం చేసిన తర్వాత కోల్డ్ ప్రెసర్ కోకోనట్ ఆయిల్ (గులాబీ రేకులు కలిపినది అయితే ఇంకా మంచిది) అప్లై చేయాలి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుని దుర్వాసనను నివారిస్తుంది. - దురద ఉన్నవారు పెప్పర్మింట్ ఆయిల్ కలపడం
కొబ్బరి నూనెలో 2–3 చుక్కల పెప్పర్మింట్ ఆయిల్ కలిపి అప్లై చేస్తే దురద తగ్గి చల్లదనం కలుగుతుంది.
చంకలలో నలుపు తగ్గడం లేదా? ఈ చిన్న పని ఈజీ గా తగ్గించుకోవచ్చు.
- మధ్యలో కడుక్కోవడం అలవాటు చేసుకోవడం
యూరిన్ లేదా మోషన్ తర్వాత నీళ్లు లేదా వెట్ టిష్యూలతో ఆ భాగాన్ని తేలికగా కడుక్కోవాలి. ఇది చెమట మరియు బ్యాక్టీరియా పేరుకుపోకుండా చేస్తుంది. - పాలిప్పు గాలి ఆడే దుస్తులు ధరించడం
కాటన్ అండర్వేర్స్ వాడడం, టైట్ దుస్తులు తగ్గించడం మంచిది. ఇవి చెమటను ఆరబెట్టి గాలి ప్రవాహం మెరుగుపరుస్తాయి. - రాత్రి పడుకునే ముందు శుభ్రం చేయడం
రోజంతా బయట ఉన్న తర్వాత రాత్రి స్నానం చేసి టెస్టికల్స్ భాగాన్ని బ్రష్‌తో శుభ్రం చేయడం అవసరం.
ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే:
- దురదలు తగ్గుతాయి
- చర్మం హార్డ్ అవ్వదు
- కురుపులు, పొక్కులు రాకుండా ఉంటుంది
- దుర్వాసన పూర్తిగా తగ్గుతుంది
శుభ్రత, గాలి ఆడే దుస్తులు, సహజమైన నూనెలు – ఇవే మగవారికి టెస్టికల్స్ భాగంలో ఆరోగ్యాన్ని కాపాడే మూడు ముఖ్యమైన చిట్కాలు.
ప్రేమ వివాహం… పదేళ్ల దాంపత్యం తర్వాత భర్తనే బలి ఇచ్చిన భార్య.