కొంతమందికి నీరు తాగడం పెద్దగా అలవాటుగా ఉండదు. రోజు మొత్తంలో చాలా తక్కువగా తాగేస్తారు. కానీ సాధారణంగా డాక్టర్లు చెప్పే లెక్క ప్రకారం రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగాలి. అయితే చాలామంది 1–2 లీటర్లకే పరిమితం అవుతున్నారు. నేను మాత్రం రోజుకు కనీసం 4 లీటర్ల నీరు తాగాలని సూచిస్తుంటాను.
కిడ్నీలకు హాని చేసే అలవాట్లు – ఆహారాలు
శరీరానికి అవసరమైన నీటి స్థాయికి 10–20% తక్కువగా నీరు తాగే వారిలో ఏమి సమస్యలు వస్తాయో తెలుసా? ఈ విషయంపై అమెరికాలోని మెరీల్యాండ్ యుఎస్ఏలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ప్రెజర్ సంస్థ 15,792 మంది పై విశాలమైన అధ్యయనం చేసింది.
ఎర్రకోట సమీపంలో కారు పేలుడు – దర్యాప్తులో కీలక మలుపు.
ఆ పరిశోధన ప్రకారం — నీరు తక్కువ తాగే వారిలో లో-గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ (low-grade inflammation) ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇది అంటే శరీర అవయవాలను నెమ్మదిగా దెబ్బతీసే అంతర్గత వాపు. దీనిని గుర్తించడానికి ఉపయోగించే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ —
- TNF–α
- IL–6
- D-dimer
- CRP
మాట్లాంటి సూచీలు గణనీయంగా పెరిగినట్లు రిపోర్టులు వెల్లడించాయి. ఇవన్నీ పెరిగితే భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది.
మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ – ఎందుకు వస్తాయి? ఎలా తగ్గించుకోవచ్చు?
ఎందుకు నీరు తక్కువ తాగితే ఇలా జరుగుతుంది?
శరీరానికి అవసరమైన జీవక్రియలు జరగడానికి నీరు తప్పనిసరి. నీరు సరిపోకపోతే, శరీరం అవసరాన్ని తీర్చుకునేందుకు లోపల నిల్వ ఉన్న కొవ్వును (fat) కరిగించి దానిలోని నీటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
మీకు తెలిసే ఉంటుంది —
1 కిలో కొవ్వు బర్న్ అయ్యేటప్పుడు
- 84% కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి పోతుంది
- 16% నీటి రూపంలో విడుదల అవుతుంది
చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ – పటాన్చెరులో విషాద ఘటన.
అంటే శరీరం లోపల నీరు తక్కువగా ఉన్నప్పుడు, కొవ్వును ఎక్కువగా కరిగించడానికి ప్రయత్నిస్తుంది.
కానీ ఈ ప్రాసెస్ అంతా పూర్తిగా సక్రమంగా జరగదు. నీరు తగ్గిన పరిస్థితిలో కొవ్వు సంపూర్ణంగా కరగకుండా, అసంపూర్ణంగా (incomplete) బర్నింగ్ జరుగుతుంది.
దీంతో శరీరంలో లో-గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ పెరిగి, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా అధికమవుతాయి. దీంతో పది పన్నెండు సంవత్సరాల తరువాత డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలు, ఇతర క్రానిక్ డిసీజెస్ వచ్చే అవకాశం పెరుగుతుందని పరిశోధకులు స్పష్టంగా నిర్ధారించారు.
కంటి చూపు మెరుగుపరుచుకునే నాలుగు రహస్యాలు – సహజంగా చూపును కాపాడుకోండి
చెప్పాలంటే…
- నీరు జీవనాధారం.
- రోజుకు కనీసం 3 లీటర్లు తాగాలి.
- సాధ్యమైనంత వరకు 4 లీటర్లు తాగడం మరింత మంచిది.
- నీరు సరిపడా తాగితే శరీర జీవక్రియలు సరిగా పనిచేస్తాయి, కొవ్వు ప్రాసెసింగ్ సక్రమంగా జరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది.
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!
ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తాగడం మొదటి అలవాటు కావాలి.