ఈ రోజుల్లో 100 మందిలో దాదాపు సగానికి పైగా హై బ్లడ్ ప్రెషర్‌తో బాధపడుతున్నారు. ఐసీఎంఆర్ 2024 నివేదిక ప్రకారం భారతదేశంలో 47% మందికి హై బీపీ ఉన్నట్లు వెల్లడైంది. చిన్న వయసు నుంచే స్ట్రెస్, తినే అలవాట్లు, జీవనశైలి మార్పులు కారణంగా బీపీ పెరిగిపోవడం సాధారణమైపోయింది. అందుకే హైబీపీని “సైలెంట్ కిల్లర్’’ అంటారు.
అయితే, బీపీ తగ్గించడానికి ఎంతో ప్రభావవంతమైన సహజ ఔషధం మన ఇంటి వంటల్లోనే ఉన్నది — యాలుకుపొడి.
ఎముకలు ఎందుకు వీక్ అవుతున్నాయి? కూల్‌డ్రింక్స్ వల్ల వచ్చే నాలుగు ప్రధాన నష్టాలు.
2009లో ఇండియాలో జరిగిన సైంటిఫిక్ స్టడీ
రాజస్థాన్‌లోని RNT మెడికల్ కాలేజ్ 2009లో 20 మంది వ్యక్తులపై 12 వారాలపాటు ఒక అధ్యయనం చేసింది. వీరికి ప్రతిరోజూ 3 గ్రాముల యాలుకుపొడి ఇచ్చారు. (అంటే సుమారు 7 యాలుకుల గింజల బరువు)
12 వారాల తర్వాత వచ్చిన ఫలితాలు ఆశ్చర్యకరమైనవి:
- సిస్టోలిక్ బీపీ (పైన బీపీ): 134 → 119
- డయాస్టోలిక్ బీపీ (కింద బీపీ): 86 → 76.3
ఇవి అన్ని జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేయకుండానే కేవలం యాలుకుపొడి తీసుకోవడం వలన వచ్చిన ఫలితాలు.అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం – పూర్తి ఆయిల్ ఉండే ఒరిజినల్ యాలుకలకే ఈ ఫలితం వస్తుంది. మార్కెట్‌లో ఎంతగా లభించే ఆయిల్ తీసేసిన యాలుకులకు ఈ ప్రయోజనం ఉండదు.
చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ – పటాన్‌చెరులో విషాద ఘటన.
ఎందుకు యాలుక బీపీ తగ్గిస్తుంది? – మూడు సైంటిఫిక్ కారణాలు
1) కిడ్నీలు ఎక్కువ సోడియంను బయటికి పంపేలా చేస్తుంది
యాలలో ఉండే సినియోల్ మరియు ఆల్ఫా-టర్పీన్ అనే సహజ రసాయనాలు కిడ్నీ ఫిల్టర్లను యాక్టివ్ చేస్తాయి.
దీంతో:
- యూరిన్ ఎక్కువగా బయటికి వస్తుంది (నేచురల్ డయురెటిక్)
- సోడియం యూరిన్ ద్వారా ఎక్కువగా బయటికి వెళ్లిపోతుంది
- రక్తంలో ఉప్పు తగ్గడంతో బీపీ సహజంగా తగ్గిపోతుంది
(సోడియం తగ్గితే ప్లాస్మా వాల్యూమ్ కూడా తగ్గుతుంది)
నరాల బలాన్ని పటుత్వాన్ని పెంచే పొడి ఇది.
2) రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ పెంచుతుంది
యాలలో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తనాళాల ఎండోథీలియంపై పనిచేసి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది.
దీని ప్రయోజనం:
- రక్తనాళాలు విస్తరిస్తాయి (వాసొడైలేషన్)
- సింగిల్ రోడ్ డబుల్ రోడ్ అయ్యినట్టుగా రక్తప్రవాహం సాఫీగా జరుగుతుంది
- బీపీ సహజంగా తగ్గిపోతుంది
3) కిడ్నీలలో ACE ఎంజైమ్‌ను తగ్గిస్తుంది
హైబీపీ పెరగడానికి కారణమైన ACE ఎంజైమ్ ఉత్పత్తిని యాలలో ఉండే టర్పీన్స్ తగ్గిస్తాయి.
దీంతో:
- రక్తనాళాలు ముడుచుకోకుండా సహజ పరిమాణంలోనే ఉంటాయి
- బీపీ తగ్గడానికి ఇది మరొక నేచురల్ సపోర్ట్
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!
యాలుకలను ఎలా వాడాలి?
ప్రమాదం లేకుండా దైనందినంగా ఇలా వాడవచ్చు:
- ఉదయం 2–4 యాలుకల గింజలను తీసుకొని నమిలి మింగేయాలి
- సాయంత్రం కూడా 2–3 యాలుకలు నమలవచ్చు
- లేదా పొడిచేసి రోజుకు 3 గ్రాములు తీసుకోవచ్చు
ముఖ్యం:
బిర్యానీ, పలావు వంటల్లో నూనెలో వేపేస్తే యాలుకల ఔషధ గుణాలు నశిస్తాయి. వేపిన యాలుకలు ఆరోగ్య ప్రయోజనం ఇవ్వవు.
బీపీ తగ్గించడమే కాదు… మరెన్నో లాభాలు
- శరీరానికి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తాయి
- జీర్ణక్రియ మెరుగుపడుతుంది
- నోరు తాజాగా ఉంటుంది
- దుర్వాసన రాకుండా కాపాడుతుంది
8 గంటలు నిద్ర పోకపోతే ఏమవుతుందో తెలుసా?
ముగింపు:
హైబీపీకి నేచురల్ సపోర్ట్ కావాలనుకునేవారికి యాలుకలు ఎంతో సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గం. సరైన విధంగా ఒరిజినల్ యాలుకలను వాడితే రక్తనాళాలు స్మూత్‌గా పనిచేసేందుకు, బీపీ తగ్గించేందుకు సహజమైన సహాయం అందిస్తుంది.