Dark Circles: ఖర్చు లేకుండా కళ్ళ కింద Dark Circles ని ఇలా పోగొట్టుకోవచ్చు:
కొంతమందికి కంటి కింద డార్క్ సర్కిల్స్ తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయి? అసలు కారణాలు ఏమిటి? సహజంగా వీటిని తగ్గించుకోవాలంటే ఏమి చేయాలి? ఈరోజు ఈ విషయాలన్నింటిని స్పష్టంగా తెలుసుకుందాం.
సాధారణంగా కంటి కింద డార్క్ సర్కిల్స్ రావడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. నిద్ర సరిగా లేకపోవడం, అధిక స్ట్రెస్ ఉండటం, ఎండల వల్ల వచ్చే యూవీ రేడియేషన్ ప్రభావం, కెమికల్ పొల్యూషన్, దుమ్ము–ధూళి వంటి అంశాలు ముఖ్యమైనవి. ఇవన్నీ కలిసి కంటి కింద చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.(Dark Circles )
పురుషుల్లో టెస్టోస్టిరోన్ తగ్గుదలకి నేచురల్ పరిష్కారం – అత్తిపత్తి వేళ్ల పొడి ప్రయోజనాలు.
అయితే అసలు లోపల ఏం జరుగుతుంది అంటే… కంటి కింద చర్మం లోపల కొలాజన్, ఎలాస్టిన్ అనే ఫైబర్స్ ఉంటాయి. ఇవే చర్మానికి బలం, ఎలాస్టిసిటీ ఇస్తాయి. పొల్యూషన్, స్ట్రెస్, ఆక్సిడేటివ్ డ్యామేజ్ వంటి కారణాల వల్ల ఈ కొలాజన్ ఫైబర్స్ దెబ్బతింటాయి. కొలాజన్ డామేజ్ అవ్వగానే అక్కడ ఉన్న బ్లడ్ వెసెల్స్ సరిగ్గా పని చేయకపోవడం మొదలవుతుంది.
బ్లడ్ ఫ్లో తగ్గిపోవడంతో ఆ భాగానికి సరిపడా ఆక్సిజన్, పోషకాలు అందవు. అలాగే వ్యర్థ రక్తం, టాక్సిన్స్ బయటకు వెళ్లే లింఫ్ వెసెల్స్ కూడా సరిగా పనిచేయవు. ఫలితంగా వేస్ట్ బ్లడ్ అక్కడే నిలిచిపోతుంది. దీంతో చర్మ కణాలకు పోషణ తగ్గి, స్కిన్ కలర్ మారడం, వాపు రావడం, నలుపు పెరగడం వంటి సమస్యలు మొదలవుతాయి.
పాతాళలోకం వినడమే గానీ ఎప్పుడైనా చూశారా?వైరల్ వీడియోలో బోరుబావి సాహసం.
ముఖ్యంగా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవారిలో కార్టిసాల్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది బ్లడ్ ఫ్లోను ఇంకా తగ్గిస్తుంది. దాంతో హీలింగ్ ప్రక్రియ మందగించి, కొలాజన్ రిపేర్ సరిగా జరగదు. ఈ పరిస్థితులన్నీ కలిసి డార్క్ సర్కిల్స్ మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తాయి.(Dark Circles )
ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది కీరదోసకాయ ముక్కలు కళ్లపై పెడుతుంటారు. ఇది కళ్లకు కాస్త రిలీఫ్ ఇస్తుంది కానీ వాపు లేదా డార్క్ సర్కిల్స్‌ను పూర్తిగా తగ్గించడంలో అంతగా ఉపయోగపడదు. వాపు ఎక్కువగా, ఎయిర్ బ్యాగ్స్‌లా కనిపిస్తే ఐస్ ప్యాక్ చాలా మంచి ఫలితం ఇస్తుంది. చిన్న ఐస్ ముక్కలను గుడ్డలో కట్టి కంటి కింద 5–10 నిమిషాలు రోజుకు 2–3 సార్లు ఉంచితే బ్లడ్ ఫ్లో మెరుగుపడి, వాపు త్వరగా తగ్గుతుంది.
డైలీ కాఫీ త్రాగే వారికి పెను ప్రమాదం!
ఇక సహజంగా ఆ భాగాన్ని హీల్ చేయడానికి అత్యంత ప్రభావవంతమైన ఔషధం కరక్కాయ (హరిటకి). కరక్కాయను రాయిపై రుద్ది పేస్ట్ చేసుకోవచ్చు లేదా కరక్కాయ పొడి తీసుకోవచ్చు. ఒక స్పూన్ కరక్కాయ పేస్ట్‌ను రోజ్ వాటర్‌తో కలిపి లేదా అలోవెరా జెల్‌తో కలిపి కంటి కింద అప్లై చేయాలి. 20 నుంచి 30 నిమిషాలు ఉంచి తర్వాత కడిగేయాలి.(Dark Circles )
కరక్కాయలో ఉండే చేబులిక్ యాసిడ్, చేబులాజిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్ వంటి సహజ రసాయనాలు దెబ్బతిన్న కొలాజన్‌ను రిపేర్ చేయడంలో ఎంతో సహాయపడతాయి. కొలాజన్ నార్మల్ అవ్వగానే బ్లడ్ వెసెల్స్, లింఫ్ వెసెల్స్ కూడా తిరిగి సక్రమంగా పనిచేయడం మొదలవుతుంది.
అలాగే కంటి కింద నలుపుకు కారణమయ్యే మెలనిన్ ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ కూడా ఈ కరక్కాయ పేస్ట్ వాడటం వల్ల నార్మల్ స్థాయిలోకి వస్తాయి. అతిగా మెలనిన్ ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేయడంలో కరక్కాయలో ఉన్న టానిన్స్, ఫ్లావనాయిడ్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. యూవీ రేడియేషన్, కెమికల్ పొల్యూషన్ వల్ల ఏర్పడే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో కూడా ఇవి శాస్త్రీయంగా నిరూపితమైన ప్రయోజనం కలిగిస్తాయి.
రోజుకు ఒకసారి కరక్కాయ పేస్ట్ అప్లై చేయడం, అలాగే రోజుకు 2–3 సార్లు ఐస్ ప్యాక్ ఉపయోగించడం ద్వారా సహజంగానే కంటి కింద డార్క్ సర్కిల్స్, వాపు తగ్గించుకోవచ్చు. బ్లడ్ ఫ్లో మెరుగుపడి, చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
ఈ రెండు సహజ పద్ధతులను క్రమంగా పాటిస్తే కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్‌ను నాచురల్‌గా తగ్గించుకోవచ్చు అని తెలియజేస్తూ… నమస్కారం.