చలికాలంలో ఇమ్మ్యూనిటి ని అమాంతం పెంచే డ్రింక్ ఇది.

చలికాలంలో ఇమ్మ్యూనిటి ని అమాంతం పెంచే డ్రింక్ ఇది.

ఈరోజు డీటాక్స్ అంశంలో భాగంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచే ఒక సులభమైన డీటాక్స్ డ్రింక్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం చలికాలం కావడంతో చాలామందికి ఇమ్యూనిటీ తగ్గినట్టుగా అనిపిస్తుంది. అందుకే దగ్గు, జలుబు, జ్వరాలు వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో శరీరానికి వేడి ఇచ్చే, ఆరోగ్యానికి మేలు చేసే ఒక డ్రింక్ తీసుకుంటే మరింత ఉపయోగకరం.

పురుషుల్లో టెస్టోస్టిరోన్ తగ్గుదలకి నేచురల్ పరిష్కారం – అత్తిపత్తి వేళ్ల పొడి ప్రయోజనాలు.

డాక్టర్ల సూచనల ప్రకారం ఇంట్లో అందుబాటులో ఉండే తులసితో తయారు చేసే డీటాక్స్ డ్రింక్ ఇమ్యూనిటీని బలోపేతం చేయడంలో చాలా సహాయపడుతుంది. దీనిని తయారు చేయాలంటే ముందుగా 15 నుంచి 20 తులసి ఆకులను ఒక పెద్ద గ్లాసు నీటిలో వేసుకోవాలి. దీనితో పాటు చిటికెడు పసుపు, ఐదు నుంచి ఏడు మిరియాలు, కొద్దిగా అల్లం తురుము వేసి బాగా మరిగించాలి. పెద్ద గ్లాసు నీరు సగం అయ్యే వరకు మరిగిన తర్వాత వడకట్టి ఆ నీటిని తీసుకోవాలి.

సోషల్ మీడియా పరిచయాలు మరో విషాదానికి దారి తీశాయి.

ఈ కషాయం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలిపి తాగాలి. నిమ్మరసం అవసరం లేదు. ఇలా తయారుచేసిన డీటాక్స్ డ్రింక్ శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించి, లివర్‌ను శుద్ధిగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇమ్యూన్ సెల్స్ విడుదల చేసే వ్యర్థ పదార్థాలను బయటకు పంపి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది.

చరిత్ర సృష్టించిన సామాన్యుడు: తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ విజేతగా పవన్‌ కల్యాణ్‌.

ఈ డ్రింక్‌ను మూడు నుంచి నాలుగు రోజుల పాటు తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి. లక్షణాలు తగ్గిన తర్వాత కూడా మరో రెండు మూడు రోజులు తీసుకోవచ్చు. ఆ తర్వాత అవసరం అనిపించినప్పుడు మాత్రమే మళ్లీ వాడుకోవచ్చు. చలికాలంలో ఇమ్యూనిటీని కాపాడుకోవడానికి ఇది ఒక మంచి సహజ మార్గం.

నరాల బలాన్ని పటుత్వాన్ని పెంచే పొడి ఇది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *