డాక్టర్ గారు, ముందుగా వెల్వెట్ బీన్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ లభిస్తాయి అనే విషయాలు చెప్పగలరా? వెల్వెట్ బీన్స్‌ను కపికచ్చు అని కూడా అంటారు. ఇవి మన దేశంలో చాలా పరిమిత ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలు, అండమాన్–నికోబార్ దీవుల్లో కొద్దిగా సాగు ఉంటుంది. అయితే వాణిజ్య పరంగా ఎక్కువగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసి అమ్ముతుంటారు. చూడటానికి ఇవి చిక్కుడు గింజల మాదిరిగానే ఉండి, రంగు మాత్రం కొంచెం నల్లగా ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఒక కిలో ధర సుమారుగా రూ.600 వరకు ఉంటుంది.
పోషక విలువలు
బీన్స్ అనగానే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. వెల్వెట్ బీన్స్‌లో కూడా మంచి పోషక విలువలు ఉన్నాయి.
100 గ్రాముల వెల్వెట్ బీన్స్‌లో సుమారుగా:
- శక్తి (క్యాలరీలు): 330
- కార్బోహైడ్రేట్లు: 50 గ్రాములు
- ప్రోటీన్: 20 గ్రాములు
- కొవ్వులు (ఫ్యాట్స్): 5 గ్రాములు
- పీచు పదార్థాలు: 7 గ్రాముల వరకు
వివాదానికి దారితీసిన శివాజీ వ్యాఖ్యలు – హీరోయిన్ల దుస్తులపై స్పష్టమైన అభిప్రాయం.
ఇవన్నిటికంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన గొప్ప ప్రయోజనం ఏమిటంటే, వీటిలో ఎల్-డోపమిన్ (L-Dopa) అనే పదార్థం అధికంగా ఉండటం. 100 గ్రాముల వెల్వెట్ బీన్స్‌లో సుమారు 5 నుంచి 7 గ్రాముల వరకు ఎల్-డోపమిన్ ఉంటుంది. ఇదే ఈ బీన్స్‌కు ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు.
ఎల్-డోపమిన్ ప్రాధాన్యం
డోపమిన్‌ను సాధారణంగా “హ్యాపీ హార్మోన్” అని అంటారు. ఇది మన మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. రోజువారీ ఒత్తిడి, కోపం, ఆందోళన, స్ట్రెస్ పెరిగినప్పుడు కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువవుతుంది. అలా కార్టిజాల్ పెరిగితే డోపమిన్ త్వరగా ఖర్చైపోతుంది, దాంతో నరాలు, మెదడు మరింత బలహీనమవుతాయి.
సాధారణంగా మనం సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు మెదడులో రోజుకు కేవలం 4–5 మిల్లీగ్రాముల డోపమిన్ మాత్రమే తయారవుతుంది. కానీ వెల్వెట్ బీన్స్‌లో మాత్రం డైరెక్ట్‌గా ఎల్-డోపమిన్ పెద్ద మొత్తంలో లభిస్తుంది. అందుకే స్ట్రెస్, యాంజైటీ ఎక్కువగా ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగపడతాయి.
చలికాలంలో ఇమ్మ్యూనిటి ని అమాంతం పెంచే డ్రింక్ ఇది.
ఏ ఏ సమస్యలకు ఉపయోగం?
వెల్వెట్ బీన్స్ ముఖ్యంగా నరాలు, మెదడుకు సంబంధించిన సమస్యల్లో మంచి ఫలితాలు ఇస్తాయి.
- పార్కిన్సన్స్ వ్యాధి
పార్కిన్సన్స్ వచ్చినవారిలో చేతులు, కాళ్లు వణకడం, మాట తడబడటం, నడకలో అసమతుల్యత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది నరాలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి. సాధారణంగా ఇంగ్లీష్ మందులు జీవితాంతం వాడాల్సి వస్తుంది.
అయితే వెల్వెట్ బీన్స్‌లో సహజంగా ఉన్న ఎల్-డోపమిన్ వల్ల, ఇవి ఇంగ్లీష్ మందుల్లానే పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. 12 మంది పార్కిన్సన్స్ రోగులకు ఉదయం 15 గ్రాములు, సాయంత్రం 15 గ్రాములు వెల్వెట్ బీన్స్ ఇచ్చి పరిశీలించగా, ఇంగ్లీష్ మందులతో పోలిస్తే రక్తంలో డోపమిన్ స్థాయి ఇంకా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. లక్షణాల పరంగా కూడా మంచి నియంత్రణ కనిపించింది. ఈ పరిశోధనను 2025లో థాయిలాండ్‌లో నిర్వహించారు. - స్ట్రెస్, యాంజైటీ, డిప్రెషన్
ఎక్కువ ఒత్తిడితో బాధపడేవారిలో డోపమిన్ తగ్గిపోతుంది. అలాంటి వారికి వెల్వెట్ బీన్స్‌లోని ఎల్-డోపమిన్ నేరుగా ఉపయోగపడుతుంది. స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతుంది. - టెస్టోస్టిరోన్ తగ్గిన పురుషులు
స్ట్రెస్, నిద్రలేమి వల్ల కార్టిజాల్ పెరిగి, టెస్టోస్టిరోన్ ఉత్పత్తి తగ్గుతుంది. వెల్వెట్ బీన్స్ వాడటం వల్ల స్ట్రెస్ తగ్గి, పిట్యూటరీ గ్రంథి నుంచి ల్యూటినైజింగ్ హార్మోన్ విడుదల పెరుగుతుంది. దీని వల్ల టెస్టికల్స్‌లోని లెడిగ్ సెల్స్ ఉత్తేజితమై టెస్టోస్టిరోన్ ఉత్పత్తి పెరుగుతుంది.
2010లో లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనలో, వెల్వెట్ బీన్స్ వాడినవారిలో సుమారు 38% వరకు టెస్టోస్టిరోన్ పెరిగినట్టు నిరూపించారు. స్పెర్మ్ మొటిలిటీ కూడా మెరుగుపడినట్టు తేలింది.
టీచర్‌తో అనుచిత సంబంధం ఆరోపణలు.. భర్తను బెదిరించిన పోలీస్ కానిస్టేబుల్.
తీసుకునే విధానం:
సాధారణ బీన్స్‌లా కూరల్లో వేసి ఉడికించి తింటే, వేడి వల్ల సుమారు 50% ఎల్-డోపమిన్ నశిస్తుంది. అలాగే జీర్ణక్రియలో కూడా కొంత వృథా అవుతుంది. అందుకే సరైన విధంగా తీసుకోవడం ముఖ్యం.
- బీన్స్‌ను తేలికగా వేపి పొడిగా చేసి ఉంచాలి.
- ఆ పొడిని తేనెతో కలిపి తినవచ్చు లేదా పాలలో కలిపి తాగవచ్చు.
- ఉదయం ఒక టేబుల్ స్పూన్, సాయంత్రం ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సుమారు 10–12 గ్రాములు అవుతుంది.
- అవసరాన్ని బట్టి రోజుకు రెండు లేదా మూడు సార్లు కూడా వాడుకోవచ్చు.
పార్కిన్సన్స్, తీవ్రమైన స్ట్రెస్, యాంజైటీ ఉన్నవారికి రోజుకు 2–3 స్పూన్లు వాడటం మంచిదిగా చెప్పొచ్చు.
ముగింపు:
వెల్వెట్ బీన్స్‌లో సహజంగా లభించే ఎల్-డోపమిన్ మానసిక ఆరోగ్యం, నరాల సమస్యలు, స్ట్రెస్, టెస్టోస్టిరోన్ లోపం వంటి సమస్యల్లో ఎంతో మేలు చేస్తుంది. సరైన మోతాదులో, సరైన విధంగా వాడితే ఇవి మంచి సహజ ఔషధంగా ఉపయోగపడతాయి.
Dark Circles: ఖర్చు లేకుండా కళ్ళ కింద Dark Circles ని ఇలా పోగొట్టుకోవచ్చు.