పురుషుల్లో ఎక్కువగా ఇబ్బంది కలిగించే సమస్యల్లో ప్రోస్టేట్ సమస్య ఒకటి. ఈ సమస్యను తగ్గించుకోవడంలో డీటాక్స్ విధానం చాలా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. మరి ప్రోస్టేట్ సమస్య ఉన్నవారు ఎలాంటి డీటాక్స్ పాటిస్తే నొప్పి తగ్గే అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోస్టేట్ సమస్య ఉన్నప్పుడు శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేసే డీటాక్స్ చాలా అవసరం. ఈ డీటాక్స్‌ను స్మూతీ రూపంలో తీసుకుంటే సులభంగా ఉంటుంది. స్మూతీగా తాగకపోయినా, కొన్ని ఆహారాలను నేరుగా తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.
పొట్టలో బ్యాక్టీరియా పెరిగితే హార్ట్ ఎటాక్ వస్తుందా ?
అలాంటి వాటిలో ముఖ్యమైనవి పీకాన్ నట్స్ (Pecan Nuts). ఇవి వాల్‌నట్స్‌లా కనిపిస్తాయి కానీ కొంచెం పొడవుగా, పలుచగా ఉంటాయి. ఈ పీకాన్ నట్స్‌లో బీటా సైటోస్టిరాల్ అనే ముఖ్యమైన పోషకం అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పీకాన్ నట్స్‌లో సుమారు 117 మిల్లీగ్రాముల బీటా సైటోస్టిరాల్ ఉంటుంది. ఇది ప్రోస్టేట్ గ్రంథి వాపు పెరగకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఉన్న సమస్య మరింత తీవ్రం కాకుండా కాపాడటానికి కూడా ఇది సహాయపడుతుంది.
సాధారణంగా 50 ఏళ్లు దాటిన పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మూడు మందిలో ఇద్దరికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే పురుషులు తప్పనిసరిగా ఈ పీకాన్ నట్స్‌ను తమ ఆహారంలో చేర్చుకోవాలి.
పేరులోనే ఉందా అదృష్టం? వైకుంఠ ద్వార దర్శన టోకెన్లలో ఆసక్తికర విశేషం.
రోజుకు 10 పీకాన్ నట్స్‌ను రాత్రి నానబెట్టి ఉదయం తినవచ్చు. ఇలా నేరుగా తినడం ఇష్టంలేనివారికి స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు.
ప్రోస్టేట్ డీటాక్స్ స్మూతీ తయారీ విధానం:
- పీకాన్ నట్స్ – 10
- దానిమ్మ గింజలు – 1 కప్పు
- టమాటో – 1
- అల్లం చిన్న ముక్క
- గుమ్మడి గింజల పప్పు – 1 స్పూన్
- చియా సీడ్స్ – 1 స్పూన్
- పాలు – అర కప్పు
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? అది ఎందుకు ప్రమాదకరం?
ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి చక్కగా గ్రైండ్ చేసి స్మూతీగా తయారు చేసుకోవాలి. ఈ స్మూతీని ఒక్కసారిగా తాగకుండా, స్పూన్‌తో 10–15 నిమిషాల పాటు నెమ్మదిగా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే శరీరం సులభంగా జీర్ణించుకుంటుంది.
అన్ని పదార్థాలు కష్టంగా అనిపిస్తే, కనీసం రోజుకు 10 పీకాన్ నట్స్‌ను 10 రోజులు వరుసగా తీసుకున్నా మంచి ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది.
Lord Venkateshwara Swamy: శ్రీవారి భక్తులకు ‘ఏఐ’ ఊరట: తిరుమలలో సక్సెస్ అయిన కొత్త టెక్నాలజీ!