Hair Fall Solutions: బక్కగా ఉన్న వారి కోసం స్పెషల్ ప్రోటీన్:
ఎంత తిన్నా కూడా శరీరానికి ఉపయోగం కావట్లేదు సార్. చాలా వీక్‌గా ఉంటున్నాను. జుట్టు ఎక్కువగా ఊడిపోతోంది, గ్రోత్ అసలు లేదు” అని 27 ఏళ్ల మహిళ చెప్పారు. ఆమె బరువు 35 కిలోలు మాత్రమే. గత పది సంవత్సరాలుగా బరువు పెరగడం లేదు, తగ్గడం కూడా లేదు. హైట్ 4.5 అడుగులు. మోషన్ రెగ్యులర్‌గా అవుతుందని, ఆకలి బాగానే వేస్తుందని చెప్పారు. రోజుకు మూడు సార్లు మాత్రమే భోజనం చేస్తారు. మధ్య మధ్యలో ఏమీ తినరు. వారానికి ఒకసారి ఉపవాసం చేస్తుంటారు.
అలాంటి వారికి ఎక్కువ రోజుల ఉపవాసం మంచిది కాదని, కానీ 3–5 రోజులు పద్ధతిగా ఉపవాసం చేయాలని సూచించారు. తేనె కలిపిన నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, సాధారణ నీళ్లు తాగుతూ ఉపవాసం చేయాలి. ప్రేగులు శుభ్రం కావడానికి ఎనిమా చేయించుకోవాలి. ఇలా ప్రేగులు శుభ్రం అయిన తర్వాత ఆకలి పెరుగుతుంది, అరుగుదల మెరుగుపడుతుంది.(Hair Fall Solutions)
చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగల బ్యాగ్.. మహిళ ఏం చేసిందంటే?
ఉదయం లేచిన వెంటనే లీటర్ పావు గోరువెచ్చని నీరు తాగాలి. రెండు గంటల తర్వాత మళ్లీ లీటర్ పావు నీరు తాగి మోషన్ రావడానికి ప్రయత్నించాలి. రోజుకు రెండు సార్లు మోషన్ అయ్యే అలవాటు రావాలి.
ఉదయం 9:30 లేదా 10 గంటల వరకు ఏ ఆహారం తీసుకోకుండా కడుపు పూర్తిగా ఖాళీ అయ్యేలా చేయాలి. ఆ తర్వాత అన్నం వండి, 30–35% అన్నం అయినా సరే, కూరతో కలిసి తినాలి. కూరల్లో సోయా గింజలు, ఉలవలు, రాజ్మా, బఠాణీలు, కాబూలీ శెనగలు వంటివి వాడాలి. ఆకుకూరలు వండేటప్పుడు కందిపప్పు, శెనగపప్పు, పెసరపప్పు వంటి పప్పులు కలపాలి. ఇలా చేస్తే మధ్యాహ్న భోజనంలోనే మంచి ప్రోటీన్ అందుతుంది, బరువు పెరగడం ప్రారంభమవుతుంది.(Hair Fall Solutions)
Knee Pains: క్యాబేజీ తో మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పొచ్చు.
ఆహారం తినేటప్పుడు చాలా నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. అరగంట నుంచి 45 నిమిషాల వరకు సమయం తీసుకోవాలి. అలా తింటేనే ఆహారం సరిగా జీర్ణమై రక్తంలోకి చేరుతుంది. లేదంటే శరీరానికి ఉపయోగం లేకుండా బయటకు వెళ్లిపోతుంది.

ఉదయం భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం ఏమీ తినకుండా ఉండాలి. సాయంత్రం 4 లేదా 5 గంటల సమయంలో బాగా ఆకలి వేసినప్పుడు ఒక గ్లాస్ జ్యూస్ తాగవచ్చు. తర్వాత నానబెట్టిన వేరుశనగలు, కొబ్బరి ముక్కలు, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, ఇతర విత్తనాలు తినాలి. ఇవన్నీ ముందే నానబెట్టుకుని ఉంచాలి. అలాగే 10 ఖర్జూరాలు, 2–3 అరటి పళ్ళు, జామకాయ లేదా సపోటా వంటి పళ్ళు తినాలి.(Hair Fall Solutions)
MPDO Office Rent Issue:ప్రభుత్వ కార్యాలయానికే దిక్కులేదు.. అద్దె బకాయిలతో రోడ్డున పడ్డ అధికారులు.
బొప్పాయి, పుచ్చకాయ, కర్బూజ వంటి పళ్ళు తినకూడదు. అరటి, సపోటా, పనస పళ్ళు బరువు పెరగడానికి చాలా మంచివి. సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపే భోజనం పూర్తిచేయాలి.
ఇలా రోజుకు రెండు సార్లు మాత్రమే పద్ధతిగా ఆహారం తీసుకుంటే ఒక నెలలోనే మంచి మార్పు కనిపిస్తుంది. ఆ తర్వాత బరువు క్రమంగా పెరుగుతుంది. అలాగే సరైన పోషకాలు, ప్రోటీన్ అందితే జుట్టు కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ముఖ్యంగా పప్పులు, గింజలు ఈ విధంగా తీసుకుంటే ప్రోటీన్ లోపం తగ్గి కండపుష్టి పెరుగుతుంది, హెయిర్ గ్రోత్ కూడా మెరుగవుతుంది.(Hair Fall Solutions)
Natural Weight Loss Foods: బరువును త్వరగా తగ్గించే ఫుడ్స్ ఇవే.
Anil Ravipudi: డ్రైవర్ కొడుకు టాప్ డైరెక్టర్ గా ఎలా ఎదిగాడు?