ప్రకృతి వైద్య విధానంలో ఈరోజు ఎపిసోడ్‌లో భాగంగా తలనొప్పి వచ్చినప్పుడు ఉపయోగపడే ఒక హెర్బల్ డ్రింక్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా తలనొప్పి వస్తే వెంటనే టాబ్లెట్లు వాడటం అలవాటుగా మారింది. కానీ ఇలా మందులు ఎక్కువగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
Geetha Madhuri: యూరియా వేసే పరికరం తయారు చేసిన విద్యార్థి గీతా మాధురి.
ప్రకృతి వైద్య విధానం ప్రకారం తలనొప్పి సమస్య తలలోనే కాదు, చాలాసార్లు గొంతు, పొట్ట, ప్రేగుల సమస్యల వల్ల కూడా వస్తుంది. జలుబు, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో బ్రెయిన్–గట్ కనెక్షన్ ఇరిటేట్ అవ్వడంతో తలనొప్పి ఏర్పడుతుంది.
Cancer: రాత్రిపూట లేటుగా అన్నం తినే వారికి క్యాన్సర్ వస్తుందా?
ఇలాంటి సమస్యలకు ఉపశమనం కలిగించేందుకు ఇంట్లోనే సులభంగా ఒక డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఒక స్పూన్ ఎండిన లెమన్ బామ్ లీవ్స్, 7–10 తులసి ఆకులు, గోంగూర గింజ పరిమాణంలో నూరిన అల్లం ముక్క, 2–3 మిరియాలు, అర టీస్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి. ఇవన్నీ ఒక పెద్ద గ్లాస్ నీళ్లలో వేసి అర గ్లాస్ అయ్యేవరకు మరిగించి, తర్వాత వడగట్టి కాస్త తేనె కలిపి తాగాలి.
Akhira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కుమారుడు అకీరా నందన్.
ఈ కషాయం పొట్ట, ప్రేగుల ఇరిటేషన్ తగ్గించి గ్యాస్ట్రిక్ సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అల్లం, ధనియాలు, మిరియాలు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. తులసి నొప్పి తగ్గించగా, లెమన్ బామ్ లీవ్స్ శాంతినిస్తాయి. ఈ హెర్బల్ డ్రింక్‌ను క్రమంగా తీసుకుంటే సైనస్, గ్యాస్ కారణంగా వచ్చే తలనొప్పికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉపశమనం పొందవచ్చు.
Obesity: కొంతమంది ఎంత తిన్నా లావు అవ్వకపోవడానికి కారణం ఇదే.