ఏపీ సర్కార్ మహిళకు గుడ్ న్యూస్:
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కసరత్తు జరుగుతోంది. జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు ఉన్నారో, ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరమో అధికారులు లెక్కలేస్తున్నారు. కూటమి పార్టీల ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒకటి. ఈ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ పథకం కింద లబ్దిదారులకు ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఒక్కో సిలిండర్ ధర రూ.837గా ఉండగా, ఏటా రూ.2,511 ఆదా ఆవుతుంది.
ఏపీ సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా ఏడాది 3 గ్యాస్ సిలిండర్ లను ఉచితంగా అందించనున్నారు. ఈ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్లరేషన్ కార్డుదారులు 1.47 కోట్ల మంది కాగా..వీరికి ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే రూ.3640 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం పారదర్శకంగానే పాలన అందిస్తుంది అంటూ తెలపడమే కాకుండా ఉచిత గ్యాస్ సిలిండర్లకు కచ్చితంగా రేషన్ కార్డు అవసరమని.. రేషన్ కార్డు మీద ఉన్న ఒకరికి మాత్రమే గ్యాస్ సిలిండర్ అందిస్తారట. మొబైల్ లింక్, ఆధార్ కార్డ్ లింక్ ,గ్యాస్ బుక్ కి లింక్ అయ్యి ఉండాలి అంటూ తెలియజేశారు. అయితే ఎంతమందికి ఇస్తారు అనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం దీపం కనెక్షన్ కింద ఉన్న గ్యాస్ సిలిండర్లకే అందిస్తారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. మరి క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb