Petrol Bunk Free Services | పెట్రోల్ బంక్ లో ఈ 6 సర్వీసెస్ ఫ్రీ తెలుసా మీకు?
ప్రస్తుతం ఉన్న ఉరుకుల, పరుగుల జీవితంలో పేద, మధ్య తరగతి వర్గాల్లో అధిక శాతం ప్రజలు ద్విచక్ర వాహనాలు వాడుతున్నారు. దాదాపు ఒక్కో ఇంట్లో రెండు మూడు బైకులు కూడా ఉన్నాయి. అయితే మధ్య తరగతిలో కొద్ది మెరుగైన ఆదాయం ఉన్నా వారు సొంత కారును కూడా కలిగి ఉంటున్నారు. ప్రస్తుతం వాహనాలు నడవాలన్నా పెట్రోల్, డీజిల్ తప్పనిసరి. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తున్నారు.
అయితే ప్రతి పెట్రోల్ బంక్ లో ప్రజల కోసం కొన్ని ఉచిత సర్వీసులు కూడా ఉంటాయి. ఆరు రకాల సర్వీస్ లు ఉచితంగానే ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియవు. పెట్రోల్ బంకు(Petrol Bunk Free Services)యజమానులు మాత్రం ఈ ఆరు సేవలను అందిస్తున్నామని ప్రభుత్వాలుకు చెబుతాయి. ఈ ఆరు సేవలను ప్రజలకు ఉచితంగా అందిస్తేనే పెట్రోల్ బంకులకు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తారు. పెట్రోల్ బంకు యజమానులు ఈ ఆరు సేవలను అందించక పోతే వారిపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఇప్పుడు మనం పెట్రోల్ బంకులవారు ఉచితం గా అందించే ఆరు ఉచిత సేవలు ఏంటో తెలుసుకుందాం.
1.ఉచితంగా గాలిని కొట్టించుకోవచ్చు
టూ వీలర్ నుండి పెద్ద వాహనాలకు వాహనానికి గల టైర్లలో తగినంత గాలి ఉండటం చాలా ముఖ్యం. అయితే పెట్రోల్ బంక్‌ల వద్ద ఉచితంగా వాహనాల టైర్లలో గాలికొట్టించుకోవచ్చు. బంక్లోగల(Petrol Bunk Free Services) గాలి నింపే యంత్రం ద్వారా వాహనాల టైర్లలో గాలిని నింపుతారు. ఇందుకోసం బంక్‌లో ఒక ఉద్యోగిని నియమిస్తారు.
2.ఉచితంగా ఫైర్ సేఫ్టీ డివైజ్
ఏవో కారణాలతో వాహనంలో పెట్రోల్ నింపుతున్నప్పుడు మంటలు అంటుకుంటే, అదే బంక్‌లో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయం వినియోగించుకున్నందుకు బంక్(Petrol Bunk Free Services)లో ఎటువంటి ఛార్జీ చెల్లించనవసరం లేదు.
3.ఉచిత అత్యవసర కాల్ సౌకర్యం
అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌లోని టెలిఫోన్ నుంచి ఉచితంగా కాల్ చేయవచ్చు. అయితే వాహనదారులు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినప్పుడు లేదా బ్యాటరీ ఛార్జింగ్ జోరో అయినప్పుడు మాత్రమే ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.
4.ఉచిత ప్రథమ చికిత్స బాక్సు
వాహనదారులు ఏదైనా గాయం అయినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌లో ఉన్న ప్రథమ చికిత్స బాక్సులోని మందులను ఉపయోగించుకోవచ్చు. అయితే ఆ బాక్సులోని మందులు గడువు ముగియనివి అయి ఉండాలని గుర్తుంచుకోండి. పెట్రోల్ పంప్(Petrol Bunk Free Services) యజమానులు ప్రథమ చికిత్స బాక్సులలోని మందులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి.
5.ఉచిత మంచినీటి సౌకర్యం
పెట్రోల్ పంపులో మంచినీటి సౌకర్యం కూడా ఉచితం. చాలా బంకులలో వాటర్ కూలర్ సదుపాయం కూడా ఉంటుంది. తద్వారా వాహన వినియోగదారులు చల్లని, పరిశుభ్రమైన నీటిని తాగవచ్చు.
6.ఉచిత వాష్‌రూమ్
వాహనదారులుతమ ప్రయాణంలో వాష్‌రూమ్ అవసరమైన సందర్భంలో పెట్రోల్ బంక్‌లోని వాష్‌రూమ్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ వాష్‌రూమ్‌లను సాధారణ ప్రజలు కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఉచిత సౌకర్యాల కోసం ఏ బంక్(Petrol Bunk Free Services)లోనైనా డబ్బులు వసూలు చేస్తే ఉన్నతాధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. చాలా మంది వాహనదారులకు బంక్‌లలో అందించే ఈ సేవల గురించి తెలియదు. ఫలితంగా వారు ఇబ్బందులకు ఎదుర్కొంటుంటారు. ఇంకెందుకు ఆలస్యం అందరికీ తెలిసేలా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb