Uppal | వృద్ద దంపతుల ఆత్మ హత్య.
Uppal : తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఉప్పల్(Uppal) లోని సాయిరాం నగర్ లో నివాసం ఉంటున్న దుర్వాసుల సూర్యనారాయణశాస్త్రి(60) , జగదీశ్వరి (56) అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు. వీరి బాగోగులు చూసుకోవాల్సిన కొడుకు వీరికి దూరంగా ఉంటున్నాడు. వీరి ఒక్కగానొక కొడుకు దూరంగా ఉండటంతో మనస్థాపం చెందిన ఆ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఉప్పల్(Uppal) సాయిరాం కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి దుర్వాసుల సూర్యనారాయణశాస్త్రి(60) , జగదీశ్వరి(56) దంపతుల ఏకైక కుమారుడు సుశాంత్ ఉన్నాడు. సుశాంత్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అతను భార్యతో కలిసి మాదాపూర్ లో ఉంటున్నాడు. వృద్దుల ఇంట్లో పని చేస్తున్న పనిమనిషి ఊరికి వెళ్ళి వచ్చి తిరిగి వృద్దుల ఇంటికి ఉదయాన్నే పనికి వెళ్ళడం తో లోపలి నుండి తలుపులు లాక్ వేసి ఉన్నాయి.
అయితే వృద్ద దంపతుల ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన వస్తుండంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగల కొట్టి చూడగా ఆ వృద్ద దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. అయితే ఈ నెల 4వ తేదీ నుంచి ఇంట్లోంచి దంపతులు బయటకు రాలేదని స్థానికులు చెబుతున్నారు. కుమారుడు దూరంగా ఉండటం, అనారోగ్య సమస్యలే ఆత్మహత్యకు కారణమని తమ చావు కు ఎవరు కారణం కారు అని సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు ఎస్సై మాధవ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాధవ రెడ్డి తెలిపారు.(Uppal)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb