ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ అలవాట్లు – షుగర్‌ దూరంగా ఉంచే రహస్యాలు.

ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ అలవాట్లు – షుగర్‌ దూరంగా ఉంచే రహస్యాలు.

ఆరోగ్యాభిలాషులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఒకప్పుడు షుగర్‌ (మధుమేహం) అనేది 60–70 ఏళ్ల వయసులో వచ్చే వ్యాధిగా భావించేవారు. కానీ ఇప్పుడు కేవలం 20–30 ఏళ్ల వయసులోనే షుగర్‌ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం — మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం, ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌.

బ్రేక్‌ఫాస్ట్‌లో చేస్తున్న తప్పులు:

మన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి.
హై గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతాయి,
లో GI ఆహారాలు అయితే నెమ్మదిగా చక్కెరను విడుదల చేస్తాయి, అందువల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

ఐసిఎంఆర్‌ 2024 లెక్కలు చెబుతున్న నిజం:

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం
ఇప్పటికే 5 నుండి 9 ఏళ్ల పిల్లల్లో 10.3%,
10 నుండి 19 ఏళ్ల వయసు పిల్లల్లో 10.4% మంది ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్నారు.
అంటే, చిన్న వయసులోనే పిల్లల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి.

మనం తినే టిఫిన్స్‌లో GI మరియు కార్బ్స్ స్థాయిలు:

టిఫిన్గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)కార్బోహైడ్రేట్లు (గ్రాములు)
ఇడ్లీ6759g
ఉప్మా / పెసరట్టు7366g
ప్లెయిన్‌ దోశ7971g
ప్లెయిన్‌ పెసరట్టు6166g
వడ3750g
మైసూరు బోండా6170g
చపాతీ6266g
రవ్వ దోశ / ఆనియన్ దోశ8070g

ఈ టిఫిన్స్‌లో ఎక్కువగా 60–70% కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి త్వరగా అరిగి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.

పంచదార మానేసి కూడా షుగర్ ఎందుకు తగ్గడం లేదు?

చాలామంది కాఫీ లేదా టీ లో పంచదార మానేస్తారు కానీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ, చపాతీ వంటి హై GI టిఫిన్స్‌ మాత్రం వదలరు.
మూడు ఇడ్లీలు తినడమంటే, రెండు స్పూన్లు పంచదార వేసిన కాఫీ తాగినట్టే!
ఇవి కూడా చివరికి బ్లడ్‌లో చక్కెరగా మారిపోతాయి — కేవలం కొంత ఆలస్యంగా అంతే.

ఏం చేయాలి:

రోజూ తినే ఆహారాన్ని లో GI, హై ఫైబర్, హై ప్రోటీన్ ఆహారాలతో మార్చండి.
ఇవి రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచుతాయి, ఇన్సులిన్ ఉత్పత్తిని సహజంగా పెంచుతాయి.

ఉత్తమమైన ఆహారాలు:

  • మొలకలు (Sprouts)
  • సాలాడ్లు
  • పండ్లు (లో GI ఉన్నవి)
  • నట్స్‌ (బాదం, ఆక్రోట్ మొదలైనవి)
  • మిల్లెట్స్‌ (సజ్జలు, రాగులు, కొర్రలు)

రోజూ తినే ఆహారం, చిన్న మార్పులతోనే షుగర్‌ వ్యాధి నుండి బయటపడవచ్చు.
పంచదార మానేసినంత సీరియస్‌గా టిఫిన్స్‌ ఎంపికలో జాగ్రత్త వహించండి.
ఆరోగ్యకరమైన జీవితానికి ఇది మొదటి అడుగు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *