ACTRESS SHOBITHA | నటి శోభిత ఆత్మహత్య.ఇండస్ట్రి లో విషాదం.
సినీ ఇండస్ట్రి లో విషాదం చోటు చేసుకుంది. అయితే కన్నడ చిత్ర పరిశ్రమ కి చెందిన శోభిత(ACTRESS SHOBITHA) కన్నడతోపాటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. డెయిలీ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది పెళ్లి చేసుకున్న నటి శోభిత…ప్రస్తుతం తన భర్త సుధీర్ తో కలిసి శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
నటి శోభిత సీరియల్స్ మాత్రమే కాకుండా తెలుగులో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే మూవీలో నటించింది.పెళ్లి తర్వాత నటి శోభిత బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయింది. శోభిత(ACTRESS SHOBITHA) తెలుగు చిత్ర పరిశ్రమ లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే శనివారం రాత్రి భారత సుధీర్‌తో కలిసి భోజనం చేసిన శోభిత ఒక బెడ్ రూములోకి వెళ్లి నిద్రపోగా.. ఆఫీస్ వర్క్ కారణం చేత తాను మరోక బెడ్రూమ్లో పనిచేసుకుని అలానే నిద్రపోయినట్లు భర్త సుధీర్ చెప్తున్నారు.
అయితే ఆదివారం ఉదయం పని మనిషి వచ్చి డోర్ కొట్టినా నటి శోభితా తీయకపోవడంతో అనుమానం వచ్చి భర్త బెడ్ రూమ్ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. శోభిత(ACTRESS SHOBITHA) ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నటి శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. శోభిత(ACTRESS SHOBITHA) సూసైడ్ కి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. శోభిత మృతి పట్ల సినీ మరియు సీరియల్ నటి నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb