ANGANVADI HELPERS: అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్.
అంగన్వాడీ హెల్పర్ల(ANGANVADI HELPERS)కు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే అంగన్వాడి టీచర్లుగా ప్రమోషన్ పొందే హెల్పర్ల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 45 ఏళ్లు దాటిన హెల్పర్లకు ప్రయోజనం చేకూరనుంది. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్యలో 4,322 మంది అంగన్వాడీ హెల్పర్లు ఉన్నారు. వీరందరికీ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది.
ఇప్పటివరకు అంగన్వాడీ సహాయకుల(ANGANVADI HELPERS)నుంచి టీచర్లుగా పదోన్నతి పొందాలంటే గరిష్ఠ వయసు 45 ఏళ్లుగా ఉండేది.అయితే తాజాగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ నిబంధనను సవరించి, వయోపరిమితిని 50 సంవత్సరాలకు పెంచింది. వయోపరిమితి పెంపునకు సంబంధించిన ఫైలుపై ఆ శాఖ మంత్రి సీతక్క గురువారం సంతకం చేసి ఆమోదం తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న 4,322 మంది అంగన్వాడీ సహాయకులకు పదోన్నతి పొందేందుకు మార్గం సుగమమైంది. మంత్రి ఆమోదం లభించడంతో ఈ అంశంపై అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి సీతక్కకు అంగన్వాడి యూనియన్ లు ధన్యవాదాలు తెలిపారు.(ANGANVADI HELPERS)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb