Balagam Mogilayya | టాలీవుడ్ లో విషాదం.బలగం మొగిలయ్య మృతి.
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. బలగం సినిమా తో ఫేమ్ అయి చిత్ర పరిశ్రమ లో మంచి పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ బలగం క్లైమాక్స్ లో తన బుర్రకథతో పాడిన పాటతో ప్రేక్షకులను మెప్పించాడు మొగిలయ్య.అయితే కొన్ని సంవత్సరాలు గా మొగిలయ్య (Balagam Mogilayya)ఆయన భార్య కొమురమ్మ బుర్రకథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బలగం సినిమాతో వీరికి మంచి పేరు వచ్చింది.
నేటి ఉదయం మొగిలయ్య(Balagam Mogilayya) కన్నుమూశారు. తెలంగాణ పల్లె వాతావరణానికి దగ్గరగా జబర్దస్త్ ఫేమస్ కమేడియన్ వేణు డైరెక్షన్‌లో వచ్చిన బలగం సినిమా తెలుగు ఇండస్ట్రీలో బంఫర్ విక్టరీ సాధించింది. అయితే బలగం మూవీ క్లైమాక్స్ పాటతో మెుగిలయ్య కోట్లాది మంది హృదయాలను కరిగించేశాడు.కుటుంబంలో మరుగునపడిపోయిన మానవ సంబంధాల విలువను వివరిస్తూ బలగం సినిమా లో మొగిలయ్య దంపతులు అద్భుతంగా పాట ఆలపించారు.
“తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొమురయ్యా” అంటూ సాగే ఆ పాట సినిమా చూసిన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. ఇక బలగం మూవీ మెుత్తం ఒకెత్తయితే.. క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాట మరో ఎత్తు అని చెప్పవచ్చు. మొగిల్లయ్య (Balagam Mogilayya)మరణంతో పలువురు బుర్రకథ కళాకారులు, సినీ ప్రముఖులు బలగం మొగిలయ్యకు నివాళులు అర్పిస్తున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb