షుగర్ ఉన్నవారికి నీరసం తగ్గి షుగర్ కంట్రోల్ అవ్వాలంటే…

షుగర్ ఉన్నవారికి నీరసం తగ్గి షుగర్ కంట్రోల్ అవ్వాలంటే…

రక్తంలో చక్కర స్థాయిలు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము. పరగడుపున పరీక్షలో షుగర్ 110 లోపు ఉంటే నార్మల్‌గా భావిస్తారు. భోజనం చేసిన తర్వాత 160 లోపు ఉంటే కూడా సాధారణ స్థాయిలోనే ఉంటుంది. ఫాస్టింగ్ 120 వరకు లేదా భోజనం తర్వాత 170–180 మధ్య ఉంటే బార్డర్‌లైన్‌గా పరిగణిస్తారు. అయితే ఫాస్టింగ్ 120 కంటే ఎక్కువగా, భోజనం తర్వాత 180 కంటే ఎక్కువగా ఉంటే షుగర్ నియంత్రణలో లేదని అర్థం.

చాలామందిలో భోజనం తర్వాత షుగర్ నార్మల్‌గా ఉన్నా, ఫాస్టింగ్ షుగర్ మాత్రం 120–150 మధ్యనే ఉంటుంది. అలాంటి వారు మందుల మోతాదు పెంచకుండా, సులభమైన రెండు అలవాట్లు పాటించడం ద్వారా ఫాస్టింగ్ షుగర్‌ను నియంత్రించుకోవచ్చు.

కంటి చూపు మసక తగ్గి కళ్ళు బాగా పని చేయాలంటే…..

మొదటి నియమం – డిన్నర్‌లో మార్పు:
సాధారణ వండిన ఆహారం బదులుగా ఎండు విత్తనాలను తీసుకోవాలి. బాదం, వాల్‌నట్స్, పిస్తా, పీకాన్ నట్స్, బ్రెజిల్ నట్స్, సన్‌ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు, వేరుశెనగలు వంటి వాటిలో ఏవైనా 4–5 రకాల్ని ఎంచుకుని తినవచ్చు. ఇవి నానబెట్టకుండా, ఎండుగానే తీసుకోవడం మంచిది.

ఈ విత్తనాల్లో అధిక ప్రోటీన్, మంచి కొవ్వులు, తక్కువ కార్బోహైడ్రేట్స్ మరియు ఎక్కువ ఫైబర్ ఉంటాయి. అందువల్ల ఇవి త్వరగా గ్లూకోజ్‌గా మారకుండా, నెమ్మదిగా జీర్ణమై రక్తంలో చక్కర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. ఫైబర్ “స్పీడ్ బ్రేకర్”లా పనిచేసి షుగర్ ఒక్కసారిగా పెరగకుండా కాపాడుతుంది.

పదవి తొలగింపు పై రాఘవ్ చద్దా సంచలన రియాక్షన్.

తినడం కష్టంగా ఉంటే స్వల్పంగా వేపి తీసుకోవచ్చు. రుచికి ఒకటి రెండు ఎండు ఖర్జూరాలు లేదా కొద్దిగా తాటి బెల్లం కలిపి తినవచ్చు. కడుపు నిండేందుకు జామ, దానిమ్మ, పియర్, కమల, కర్బూజ వంటి పండ్లు కూడా జతచేయవచ్చు.

రెండవ నియమం – డిన్నర్ తర్వాత నడక:
భోజనం చేసిన తర్వాత కనీసం అరగంట నుంచి ఒక గంట వరకు నడవాలి. ఇది రక్తంలో ఉన్న చక్కరను శరీరం శక్తిగా వినియోగించుకునేలా చేసి, అదనంగా నిల్వ కాకుండా నిరోధిస్తుంది.

నచ్చింది తింటూ బరువు తగ్గొచ్చు…కానీ ఈ తప్పు చేస్తే మళ్లీ పెరుగుతారు.

ఈ రెండు అలవాట్లు పాటిస్తే ఫాస్టింగ్ షుగర్‌ను సహజంగా తగ్గించుకోవచ్చు. అదనంగా, విత్తనాలు గుడ్ కొలెస్ట్రాల్ పెంచి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. శరీరానికి బలం, దారుఢ్యం కూడా అందిస్తాయి.

అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు డిన్నర్‌లో ఈ విధమైన ఆహారం తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలితో షుగర్‌ను నియంత్రించుకోవడం సాధ్యమే. నమస్కారం.

ఆకివీడు రామాలయ ఘటన: కరాటే కళ్యాణి ఆగ్రహం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *