వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కంటి చూపులో మార్పులు రావడం సహజం. కొంతమంది ప్రతి సంవత్సరం కళ్ళద్దాల పవర్ పెంచుకోవాల్సి వస్తుంది. దీని ప్రధాన కారణం స్క్రీన్ టైమ్ పెరగడం, మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు ఎక్కువగా వాడటం, కంటి స్ట్రెయిన్ పెరగడం.
కానీ కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి, చూపు తగ్గకుండా ఉంచటానికి, స్ట్రెయిన్ తగ్గించటానికి నాలుగు అద్భుతమైన సహజ రహస్యాలు ఉన్నాయి. ఇవి ఎవరైనా ఇంట్లోనే సులభంగా చేయగలిగేవి.
ప్రోటీన్ ను బాగా అందించే ఈ పిండి ముక్క గురించి తెలుసుకుందాం.
1. ఐ ప్యాక్స్ (Eye Packs)
రోజుకు 3–4 సార్లు ఈ చల్లని ఐ ప్యాక్స్ వాడటం కంటి అలసటను తగ్గిస్తుంది.
- టిష్యూ పేపర్ లేదా చిన్న గుడ్డను చల్లని నీళ్లలో తడిపి, కంటి మీద ఉంచాలి.
- లేదా ఫ్రిజ్‌లో కొన్ని నిమిషాలు ఉంచిన తర్వాత వేసుకోవచ్చు.
- 5 నుంచి 10 నిమిషాలపాటు ఉంచి, మధ్యలో తిప్పి మరో వైపు ఉంచాలి.
ఫలితం:
ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ రక్త ప్రసరణ పెరుగుతుంది. కంటి మజిల్స్ రిలాక్స్ అవుతాయి. పొల్యూషన్ వల్ల వచ్చే మంటలు, ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉండటం వల్ల వచ్చే పొడితనం తగ్గుతుంది. పిల్లలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది.
2. కంటి వ్యాయామాలు (Eye Exercises)
కంటి కండరాలు బలపడేందుకు వ్యాయామాలు తప్పనిసరి.
రోజూ 10–15 నిమిషాలు ఇలా చేయండి:
- కళ్ళను ఎడమ నుండి కుడి వైపు కదపండి.
- పైకి కిందకి నెమ్మదిగా కదపండి.
- 45 డిగ్రీ యాంగిల్‌లో చూపును ఎగువ, దిగువ మూలలకు మార్చండి.
- కంటి గుండ్రాన్ని క్లాక్‌వైజ్, తర్వాత యాంటీ క్లాక్‌వైజ్‌గా తిప్పండి.
అదనంగా:
ఉదయం సూర్యోదయ సమయంలో 2–3 నిమిషాలు సూర్యుడి కాంతిని కళ్ళార్పకుండా చూడటం కూడా చాలా మంచిది. ఇది కంటి కండరాలను బలపరుస్తుంది, చూపును పదును చేస్తుంది.
చంకలలో నలుపు తగ్గడం లేదా? ఈ చిన్న పని ఈజీ గా తగ్గించుకోవచ్చు.
3. 20-20-20 టెక్నిక్
స్క్రీన్ ముందు ఎక్కువసేపు కూర్చునే వారికీ ఇది అత్యంత అవసరం.
- ప్రతి 20 నిమిషాలకు ఒకసారి,
- 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును,
- 20 సెకన్లపాటు చూడాలి.
ఇలా చేయడం వల్ల కంటి కండరాలు రిలాక్స్ అవుతాయి, స్క్రీన్‌పై దీర్ఘకాలం దృష్టి కేంద్రీకరించడం వల్ల వచ్చే స్ట్రెయిన్ తగ్గుతుంది. ఆఫీస్‌లో, స్కూల్లో, ఎక్కడైనా ఈ టెక్నిక్‌ను సులభంగా పాటించవచ్చు.
4. కంటి చూపును మెరుగుపరచే ఆహారం
కంటి ఆరోగ్యానికి విటమిన్ A మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం.
ఇవి ఎక్కువగా ఉండే పదార్థాలు:
- మునగాకు (నంబర్ వన్ సూపర్ ఫుడ్)
- పొడి రూపంలో కూరల్లో, జ్యూస్‌లో, కారపొడిలో కలపవచ్చు.
- కొత్తిమీర, కరివేపాకు – ఇవి వెజిటబుల్ జ్యూసుల్లో లేదా వంటకాల్లో వేసుకోవాలి.
- ఫలాలు, గింజలు (nuts) – ఇవి కంటి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
మునగాకు పొడి, కొత్తిమీర, కరివేపాకు ఈ మూడింటిని రోజూ వాడితే చూపు క్రమంగా మెరుగుపడుతుంది.
ఓవరీస్ నీటి బుడగలు తగ్గి గుడ్ బ్యాక్టీరియా పెరగాలంటే ఇలా చేయండి.
ఈ నాలుగు రహస్యాలను (ఐ ప్యాక్స్, కంటి వ్యాయామాలు, 20-20-20 టెక్నిక్, పోషక ఆహారం) నిరంతరం పాటిస్తే:
- కంటి స్ట్రెయిన్ తగ్గుతుంది
- చూపు క్రమంగా బలపడుతుంది
- కళ్ళద్దాల పవర్ పెరగకుండా నిలబెట్టుకోవచ్చు
పూర్వం రోజుల్లో ఈ పద్ధతులు పాటించే వారు కళ్ళద్దాలు పూర్తిగా వాడకపోయినా చూపు బాగానే ఉండేది. ఇప్పుడు స్క్రీన్ టైమ్ ఎక్కువైందని చూపు దెబ్బతింటుంది. కనుక ఈ చిన్న మార్పులు చేయండి — చూపు కాపాడుకోండి, కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోండి.