రోజుకో కప్పు ఇలా తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

రోజుకో కప్పు ఇలా తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఆరోగ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక నమస్కారాలు. మొలకలు వచ్చిన విత్తనాలు పోషకాల పరంగా ఎంతో శక్తివంతమైన ఆహారం. సాధారణంగా రెండు ఎండు గింజల్లో ఉండే పోషకాలు, మొలక వచ్చిన ఒక గింజలోనే అభివృద్ధి చెందుతాయి. స్ప్రౌట్స్‌లో మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండి, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు తక్కువగా ఉంటాయి.

పెసలు, శెనగలు, బొబ్బర్లు వంటి విత్తనాలను మొలకల రూపంలో తీసుకోవడం మంచిది. అయితే బొబ్బర్లు ప్రత్యేకంగా “హ్యాపీ హార్మోన్”గా పిలిచే GABA హార్మోన్‌కు మంచి మూలం. ఇది మనసును ప్రశాంతంగా ఉంచి, కోపం, ఆందోళన, ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. మొలకల రూపంలో బొబ్బర్లు తీసుకుంటే ఈ హార్మోన్ స్థాయి మరింత పెరుగుతుంది.

Brazil Nuts తో జరిగే మిరాకిల్స్ ఇవే | పిల్లలు లేని వారికి ఇది ఒక వరం.

బొబ్బర్లలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్, కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా ఉపయోగపడతాయి. అయితే వీటిని ఉడికించి తింటే కొన్ని పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి తాజా మొలకలుగా తీసుకోవడం ఉత్తమం.

రుచికోసం మొలకల్లో క్యారెట్, టమోటా ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం కలిపి తినవచ్చు. ఇలా రోజువారీ ఆహారంలో స్ప్రౌట్స్‌ను చేర్చుకుంటే శారీరకమే కాక మానసిక ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.

పిల్లి కోసం యువతి బలవన్మరణం: అల్వాల్‌లో విషాదం.

మలబద్ధకం ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉందా?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *