Body Detoxification Drink: ఒంట్లో పేరుకుపోయిన కెమికల్స్ క్లీన్ అవ్వాలంటే:
మన శరీరానికి తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణం కావాలన్నా, అందులోని విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు శరీరంలో సమర్థంగా శోషించబడాలన్నా లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి లివర్ ఆరోగ్యంగా పనిచేయాలంటే అప్పప్పుడూ దానికి డీటాక్స్ అవసరం. అందుకే ఈరోజు ఎపిసోడ్‌లో లివర్‌ను సహజంగా ఎలా శుద్ధి చేసుకోవచ్చో తెలుసుకుందాం.
సాధారణంగా లివర్ డీటాక్స్‌కు ఫాస్టింగ్ చాలా మంచిదని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే కొందరికి పూర్తిగా ఉపవాసం చేయడం కష్టం అనిపించవచ్చు. ఫాస్టింగ్ చేయలేకపోయినా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకునే వారికి ఒక మంచి ప్రత్యామ్నాయం ఉంది. అలాంటి వారికోసం బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఫాస్టింగ్ మంచి పరిష్కారంగా పనిచేస్తుంది.(Body Detoxification Drink)
మగవారు తప్పకుండా త్రాగవలసిన డ్రింక్ ఇది.
బ్లాక్ ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే సహజ రసాయనం లివర్ డీటాక్సిఫికేషన్‌కు చాలా ఉపయోగపడుతుంది. ఇది లివర్‌లో డీటాక్స్‌కు అవసరమైన ఎంజైమ్స్‌ను చురుకుగా పనిచేసేలా చేస్తుంది. దాంతో లివర్ తనంతట తానుగా శుభ్రపడే ప్రక్రియ వేగవంతమవుతుంది. చెప్పాలంటే లివర్‌కు పని చేయడానికి ప్రేరణ ఇచ్చినట్లుగా ఈ రెస్వెరాట్రాల్ పనిచేస్తుంది.

ఈ విధంగా డీటాక్స్ చేయాలంటే ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం మరోసారి బ్లాక్ గ్రేప్ జ్యూస్(Body Detoxification Drink) తాగాలి. ఈ రోజంతా ప్రధానంగా అదే జ్యూస్ తీసుకోవాలి. ఒక్కసారి సుమారు 250 నుంచి 300 ఎంఎల్ జ్యూస్ సరిపోతుంది. మధ్య మధ్యలో తగినంత నీళ్లు తాగడం కూడా చాలా అవసరం.
ఇలా బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఫాస్టింగ్ చేయడం వల్ల శరీరంలో చేరిన విషపదార్థాలు, పురుగు మందుల అవశేషాలు, కెమికల్స్, ఆల్కహాల్, సిగరెట్లు, అధిక టీ–కాఫీ వల్ల ఏర్పడే దుష్ప్రభావాలను లివర్ విచ్ఛిన్నం చేస్తుంది. అందులో సుమారు 80 శాతం మూత్రం ద్వారా, 20 శాతం మలమార్గం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ శుభ్రత లభిస్తుంది.
లివర్‌కు వారానికి ఒకసారి మేలు చేయాలనుకునే వారు సోమవారం ఫాస్టింగ్ చేస్తే మంచిదని చెబుతారు. పూర్తిగా ఉపవాసం చేయలేని వారు ఆ రోజున జ్యూస్ ఫాస్టింగ్(Body Detoxification Drink) పాటించవచ్చు. లేదా సోమవారం ఉపవాసం చేసినవారు మంగళవారం బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఫాస్టింగ్ చేయడం కూడా మంచిదే.
పొట్టలో బ్యాక్టీరియా పెరిగితే హార్ట్ ఎటాక్ వస్తుందా ?
సాయంత్రం 6 లేదా 7 గంటల లోపే జ్యూస్ తీసుకోవడం ఆపేయాలి. ఆ తర్వాత లివర్‌కు విశ్రాంతి ఇవ్వాలి. అలా చేస్తే రాత్రంతా లివర్ మరింత సమర్థంగా పనిచేసి శుభ్రత ప్రక్రియను పూర్తిచేస్తుంది. ఈ విధానాన్ని పాటిస్తే లివర్ ఆరోగ్యానికి మంచి ఫలితాలు పొందవచ్చు.
Gmail: జీమెయిల్ వాడుతున్నారా..? 2026 లోఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్.