నమస్కారం డాక్టర్ గారు. మన కార్యక్రమం ద్వారా సాధారణంగా అందరికీ తెలిసిన జామ, బత్తాయి, దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లతో పాటు తెలియని పండ్లలో కూడా ఉన్న ఔషధ గుణాలు, పోషక విలువలపై అవగాహన కల్పిస్తూ వస్తున్నాం. ఈరోజు ఎపిసోడ్‌లో ఇటీవల ప్రాచుర్యం పొందుతున్న “గ్యాక్ ఫ్రూట్” గురించి తెలుసుకుందాం.
గ్యాక్ ఫ్రూట్ చూడడానికి ఆకర్షణీయంగా ఉండి, లోపల గింజల చుట్టూ ఎర్రటి గుజ్జు ఉంటుంది. కాకరకాయ పండినప్పుడు కనిపించే రంగుతో పోలి ఉంటుంది. ఈ గుజ్జును స్పూన్‌తో తీసుకుని నేరుగా తినవచ్చు లేదా జ్యూస్‌లలో కలిపి ఉపయోగించవచ్చు. విదేశాల్లో ఎక్కువగా లభించే ఈ పండు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కొద్దికొద్దిగా సాగు అవుతూ మార్కెట్లోకి వస్తోంది.
నచ్చింది తింటూ బరువు తగ్గొచ్చు…కానీ ఈ తప్పు చేస్తే మళ్లీ పెరుగుతారు.
పోషక విలువల విషయానికి వస్తే, 100 గ్రాముల గ్యాక్ ఫ్రూట్‌లో సుమారు 43 కేలరీల శక్తి, 9 గ్రాముల కార్బోహైడ్రేట్స్, తక్కువ ప్రోటీన్, ఫైబర్ మరియు మంచి మోతాదులో విటమిన్ C ఉంటాయి. ముఖ్యంగా ఇందులో బీటా కెరోటిన్, లైకోపీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి.
గ్యాక్ ఫ్రూట్ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీటా కెరోటిన్, లైకోపీన్ కారణంగా కంటి చూపును రక్షించడం, రెటీనాను బలపరచడం, క్యాటరాక్ట్ వంటి సమస్యల నుంచి కాపాడడం జరుగుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో కంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండు కావడంతో షుగర్ స్థాయిలను పెంచదు.
పిల్లి కోసం యువతి బలవన్మరణం: అల్వాల్‌లో విషాదం.
అలాగే లివర్ డిటాక్సిఫికేషన్, మెదడు శక్తి పెంపు, గుండె ఆరోగ్య రక్షణలో కూడా ఇది ఉపయోగపడుతుంది. లైకోపీన్ కారణంగా రక్తనాళాల్లో పేరుకుపోయే కొవ్వును తగ్గించి హృదయ సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
ఈ పండును నేరుగా తినవచ్చు, జ్యూస్‌గా తీసుకోవచ్చు లేదా ఇతర పండ్లతో కలిపి తీసుకోవచ్చు. రుచి కొద్దిగా సాధారణంగా ఉన్నప్పటికీ ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉండటంతో వాడటం మంచిది. ప్రస్తుతం రైతులు కూడా దీని సాగు వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి మనం కూడా వినియోగిస్తే వారికి ప్రోత్సాహం లభిస్తుంది.కొత్తగా పరిచయమవుతున్న ఈ గ్యాక్ ఫ్రూట్‌ను మీ ఆహారంలో చేర్చుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
రోజుకో కప్పు ఇలా తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.