Gandham Podi:డల్ గా వాడిపోయిన ముఖాన్ని మెరిసేలా చేసే ప్యాక్ ఇది:
ఇతిహాస కాలం నుంచి మహారాణులు తమ సౌందర్యాన్ని, చర్మ కాంతిని కాపాడుకునేందుకు గంధాన్ని(Gandham Podi) నిత్యం ఉపయోగించేవారని మనం వింటూ ఉంటాం. ఇది కేవలం కథ కాదు… గంధపొడి నిజంగానే చర్మ నలుపును తగ్గించి సహజమైన కాంతిని పెంచే అద్భుతమైన గుణాలు కలిగి ఉందని శాస్త్రీయ పరిశోధనలు నిరూపించాయి.
యూకేలోని రాయల్ బొటానికల్ గార్డెన్స్ (2004) మరియు కొరియాలోని చుంగ్ యాంగ్ యూనివర్సిటీ (2016) చేసిన పరిశోధనల్లో గంధపొడి(Gandham Podi)లో చర్మ సౌందర్యాన్ని పెంచే ఆరు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడయ్యాయి.
చలికాలంలో ఆరోగ్యం: ఒంట్లో రక్తాన్ని, వేడిని పెంచే చిట్కాలు
మొదటగా, గంధపొడి(Gandham Podi)లోని ఆల్ఫా శాంటనాల్ మెలనిన్ ఉత్పత్తికి అవసరమైన థైరోజినేజ్ అనే ఎంజైమ్‌ను అడ్డుకోవడం ద్వారా నలుపు వర్ణం ఉత్పత్తిని మూలంలోనే తగ్గిస్తుంది.
రెండవది, బీటా శాంటనాల్, శాంటాలిన్ వంటి పదార్థాలు TNF-ఆల్ఫా, IL-6 లాంటి హానికర కెమికల్స్‌ను తగ్గించి మెలనోసైట్స్ అధికంగా పనిచేయకుండా కంట్రోల్ చేస్తాయి.

మూడవది, ఎండ నుంచి వచ్చే UV రేస్ వల్ల కలిగే డామేజ్‌ను తగ్గించి చర్మాన్ని రక్షిస్తాయి.
నాలుగవది, బ్యాక్టీరియాలను నశింపజేసి చర్మ ఇరిటేషన్, డార్కెనింగ్ తగ్గిస్తాయి.
ఐదవది, సెస్క్వీ టర్పీన్స్ కొలాజన్‌ను బలంగా ఉంచి ముడతలు రాకుండా చేస్తాయి.
ఆరవది, పింపుల్స్, పొక్కులు, వాటి మచ్చలను తగ్గించడంలో గంధం(Gandham Podi) ఎంతో సహాయపడుతుంది.
అమెరికాలో భారతీయుడి గొప్ప మనసు: నిరుపేద జంట ఆకలి తీర్చి నెటిజన్ల మనసు గెలుచుకున్న నోవా.
అయితే మార్కెట్‌లో దొరికే గంధపొడిలో ఎక్కువగా కల్తీ ఉంటుంది. కాబట్టి ఒరిజినల్ గంధపు చెక్కను సానరాయిపై అరగదీసి వచ్చిన పేస్ట్‌ను మాత్రమే వాడాలి. ముఖానికి లేదా శరీరానికి అప్లై చేసి 20–30 నిమిషాల తర్వాత మృదువుగా మసాజ్ చేసి స్నానం చేస్తే చర్మానికి సహజమైన గ్లో, కాంతి లభిస్తుంది. కల్తీ లేని స్వచ్ఛమైన గంధాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే నిజమైన ఫలితాలు తప్పకుండా పొందవచ్చు.