షుగర్ వ్యాధి గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది ముందుగా వినే పదం “జీఐ” లేదా గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ మధ్యకాలంలో మనం కొనుగోలు చేసే ఆహార ప్యాకెట్ల వెనుక కూడా జీఐ శాతం చూపిస్తున్నారు. కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి? సాధారణంగా అర్థమయ్యేలా చెప్పాలంటే—మనము తినే పిండి పదార్థాలు జీర్ణం అయిన తర్వాత చక్కెరగా మారి రక్తంలోకి చేరుతాయి. అవి ఎంత వేగంగా రక్తంలోకి చేరుతాయో దానిని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు.
సూర్య గ్రహణం ప్రభావంతో 4 రాశులవారికి జరిగేది ఇదే..?
అన్నం, బియ్యం, రవ్వ, మైదా, కార్న్ ఫ్లోర్ వంటి పిండి పదార్థాలు త్వరగా అరిగి రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచుతాయి. ఇవి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు. కానీ పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు మెల్లగా జీర్ణమై చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇవి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు. వైద్య ప్రమాణాల ప్రకారం జీఐ విలువ 50 లోపు ఉంటే లో, 50 పైగా ఉంటే హైగా పరిగణిస్తారు.
కంటి చూపును డ్యామేజ్ అవ్వకుండా కాపాడే డ్రింక్ ఇది.
ఈ రోజుల్లో శారీరక శ్రమ తగ్గిపోవడంతో హై జీఐ ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర నిల్వై షుగర్ పెరుగుతుంది. అందుకే షుగర్ ఉన్నవారు మాత్రమే కాదు, రాకుండా జాగ్రత్తపడేవారు కూడా జీఐ విలువలను గమనించాలి. తెల్లటి, పాలిష్ చేసిన ధాన్యాల కంటే సంపూర్ణ ధాన్యాలు, మొలకలు, నానబెట్టిన విత్తనాలు వంటి సహజ ఆహారాలను తీసుకోవడం మంచిది.
పిల్లలకి ఇంట్లోనే హెల్తి జామ్ ఇలా చేసుకోవచ్చు.
ఉదయం తినే ఇడ్లీ, దోశ, పరోటా, రవ్వ దోశ, పులిహోర వంటి చాలా టిఫిన్స్ హై జీఐ కేటగిరీలోనే వస్తాయి. కాబట్టి మితంగా తీసుకోవడం, ప్రత్యామ్నాయంగా లో జీఐ ఆహారాలను అలవాటు చేసుకోవడం అవసరం. రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరిగే ఆహారాలే మనకు మిత్రాలు; వేగంగా పెంచేవి శత్రువుల్లాంటివి. ఆరోగ్యకరమైన ఎంపికలతోనే షుగర్‌ను నియంత్రణలో ఉంచవచ్చు.
అన్నమయ్య జిల్లాలో ‘పుష్ప’ సినిమా తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టురట్టు.