ఇక ఈరోజు ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్ అంశంలో భాగంగా మన రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే ఏ పండ్లు తీసుకోవాలో తెలుసుకుందాం. డాక్టర్లు ఎప్పుడూ చెప్పే మాటేంటంటే—వెజిటేబుల్స్, ఫ్రూట్స్‌ను రోజూ ఆహారంలో చేర్చుకుంటే ఇమ్యూనిటీ గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి ఎంతో అవసరం.
పవన్ కళ్యాణ్ కృషితో తీరిన దశాబ్దాల కల.. గొల్లప్రోలు బ్రిడ్జి ప్రారంభోత్సవంతో పిఠాపురం ప్రజల హర్షం!
యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన శరీరంలోని కణాలు, అవయవాలను జబ్బుల నుంచి రక్షించి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని రిపేర్ చేయడంలో సహాయపడే పోషకాలు. ఇవి ఎక్కువగా ఉండే పండ్లు తీసుకుంటే మనం త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
Viral Video:కోర్టు హాల్‌లో భార్య దాడి.. నవ్వుతూ తప్పించుకున్న భర్త.. వైరల్ వీడియో వెనుక షాకింగ్ కథ!
మొదటిగా నారింజ పండు—ఇందులో విటమిన్ C అధికంగా ఉంటుంది. రెండవది జామకాయ, ఇది కూడా విటమిన్ Cకి మంచి మూలం. మూడవది సీజనల్‌గా లభించే నేరేడు, దీనిని ‘కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్’ అని కూడా అంటారు. నేరేడు దొరికినప్పుడు తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. నాలుగవది బెర్రీస్—బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటివి ఫ్రెష్‌గా లేదా డ్రై ఫామ్‌లో అయినా రెగ్యులర్‌గా వాడవచ్చు. చివరిగా ఐదవది దానిమ్మ—పండు గానీ, రసం గానీ తీసుకోవచ్చు.
చలికాలంలో ఆరోగ్యం: ఒంట్లో రక్తాన్ని, వేడిని పెంచే చిట్కాలు.
ఈ ఐదు రకాల పండ్లు యాంటీ ఆక్సిడెంట్స్, సూక్ష్మ పోషకాలు, విటమిన్స్ ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫ్రూట్స్. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యం, ఇమ్యూనిటీ రెండూ బలంగా ఉంటాయి.
Gandham Podi:డల్ గా వాడిపోయిన ముఖాన్ని మెరిసేలా చేసే ప్యాక్ ఇది.