బాడిలో కొలెస్ట్రాల్ పేరుకోకుండా కాపాడే LOW CARB ఆహారం ఏంటో తెలుసా?

బాడిలో కొలెస్ట్రాల్ పేరుకోకుండా కాపాడే LOW CARB ఆహారం ఏంటో తెలుసా?

మన ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా తరచూ హెల్త్ టిప్స్ అందిస్తున్నాం. చాలా మంది మష్రూమ్స్‌ను కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగిస్తారా? లేక ఇతర ప్రయోజనాలూ ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి మష్రూమ్స్‌లో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉండటంతో పాటు మంచి ఫైబర్ కూడా లభిస్తుంది. అందువల్ల ఇవి డైట్ ఆహారంగా మాత్రమే కాకుండా, సమగ్ర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

కంటి చూపును డ్యామేజ్ అవ్వకుండా కాపాడే డ్రింక్ ఇది.

ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మష్రూమ్స్ ఎంతో ఉపయోగకరం. చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగకుండా నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. మష్రూమ్స్‌లో సహజంగా లభించే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడంలో పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా బీటా గ్లూకాన్స్, గాలిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి సంయోగాలు రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించి, కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతాయి.

అన్నమయ్య జిల్లాలో ‘పుష్ప’ సినిమా తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టురట్టు.

రక్తనాళాల గోడలు దెబ్బతినకుండా రక్షించి, హార్ట్ బ్లాక్స్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి తోడ్పడతాయి. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు మెరుగుపడటానికి సహాయపడతాయి. కుటుంబపరంగా గుండెజబ్బుల ప్రమాదం ఉన్నవారు, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు మష్రూమ్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. కాబట్టి మష్రూమ్స్‌ను కేవలం వెయిట్ లాస్ కోసం మాత్రమే కాకుండా గుండె ఆరోగ్య రక్షణ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.

పిల్లలకి ఇంట్లోనే హెల్తి జామ్ ఇలా చేసుకోవచ్చు.

సూర్య గ్రహణం ప్రభావంతో 4 రాశులవారికి జరిగేది ఇదే..?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *