పొట్టలో బ్యాక్టీరియా పెరిగితే హార్ట్ ఎటాక్ వస్తుందా ?

 పొట్టలో బ్యాక్టీరియా పెరిగితే హార్ట్ ఎటాక్ వస్తుందా ?

ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇటీవలి పరిశోధనలు ఒక కీలక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. గుండె జబ్బులు, హార్ట్ అటాక్‌లతో మరణాల ముప్పు పెరగడానికి మన శరీరంలో ఉన్న కొన్ని రకాల చెడ్డ బ్యాక్టీరియాలే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. ముఖ్యంగా ప్రేగుల్లోనూ, నోట్లోనూ ఉండే చెడ్డ సూక్ష్మజీవులు ఈ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తున్నాయని తేలింది.

మన శరీరంలో మంచి బ్యాక్టీరియాలు, చెడ్డ బ్యాక్టీరియాలు రెండూ ఉంటాయి. ప్రేగుల్లోనే కాదు, నోట్లో కూడా ఇవి సహజంగానే ఉంటాయి. అయితే కొందరిలో చెడ్డ బ్యాక్టీరియాల సంఖ్య ఎక్కువగా ఉండగా, మంచి బ్యాక్టీరియాలు తక్కువగా ఉంటాయి. అలాంటి వారిలో గుండె జబ్బుల ముప్పు గణనీయంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

పాతాళలోకం వినడమే గానీ ఎప్పుడైనా చూశారా?వైరల్ వీడియోలో బోరుబావి సాహసం.

నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు సుమారు 7 మీటర్లు (దాదాపు 21 అడుగులు) పొడవున్న ప్రేగుల వ్యవస్థలో లక్షలాది సూక్ష్మజీవులు నివసిస్తుంటాయి. ఎవరిలో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయో, వారికి నోట్లో చిగుళ్ల సమస్యలు లేదా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఆ చెడ్డ బ్యాక్టీరియాలు రక్తంలోకి ప్రవేశిస్తాయి. అలాగే ప్రేగుల గోడలు బలహీనంగా మారినప్పుడు, అక్కడ ఏర్పడిన చిన్న గ్యాప్‌ల ద్వారా కూడా ఈ చెడ్డ సూక్ష్మజీవులు రక్తంలోకి చేరుతాయి.

రక్తంలోకి వెళ్లిన ఈ బ్యాక్టీరియాలు శరీరం అంతా ప్రయాణించి, ఇప్పటికే కొలెస్ట్రాల్ పేరుకుపోయిన చోట్లకు చేరుతాయి. అది గుండె రక్తనాళాల్లో కావచ్చు, మెదడులో కావచ్చు లేదా ఇతర భాగాల్లో కావచ్చు. కొలెస్ట్రాల్ పేరుకుపోయిన ఆ రఫ్ భాగాలపై ఈ చెడ్డ బ్యాక్టీరియాలు ఒక పొరలా కూరుకుపోతాయి. దెబ్బ తగిలిన చోట చర్మం మీద పొర ఏర్పడినట్టే, అక్కడ బ్యాక్టీరియల్ ఫిలిం ఏర్పడుతుంది.

బియ్యం కడిగిన నీళ్లు మీ చర్మానికి వాడుతున్నారా?

ఇలా బ్యాక్టీరియా గూడకట్టుకోవడంతో శరీర రక్షణ వ్యవస్థ అలర్ట్ అవుతుంది. ఆ ప్రాంతంలో ఇన్ఫ్లమేషన్ పెరిగి వాపు ఏర్పడుతుంది. ఇప్పటికే రక్తనాళం లోపల కొలెస్ట్రాల్‌తో ఇరుకుగా ఉన్న మార్గం, వాపు కారణంగా మరింత కుచించుకుపోతుంది. ఫలితంగా రక్తప్రసరణకు తీవ్ర అవరోధం ఏర్పడి, గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి ప్రమాదాలు సంభవిస్తాయి.

పోస్ట్‌మార్టం పరీక్షల్లోనూ, హార్ట్ అటాక్‌తో మరణించిన అనేక మందిలో రక్తనాళాల్లోని పూడికల దగ్గర బ్యాక్టీరియల్ ఫిలిం ఏర్పడి, తీవ్రమైన వాపు ఉండటం స్పష్టంగా కనిపించిందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే చెడ్డ బ్యాక్టీరియాలే గుండె జబ్బుల ముప్పును పెంచుతున్నాయని శాస్త్రీయంగా రుజువైంది.

యువతలో కొత్త రిలేషన్ ట్రెండ్ – ‘హుష్ డేటింగ్’ అంటే ఏమిటి?

అయితే భయపడాల్సిన అవసరం లేదు. చెడ్డ బ్యాక్టీరియాలను నియంత్రించే శక్తి మన శరీరానికే ఉంది. నోట్లో, ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉంటే, అవే చెడ్డ బ్యాక్టీరియాల పెరుగుదలను అడ్డుకుంటాయి. సమాజంలో మంచి ఎక్కువైతే చెడు తగ్గినట్టే, శరీరంలో కూడా మంచి సూక్ష్మజీవులు ఎక్కువైతే చెడ్డవి అదుపులో ఉంటాయి.

మంచి బ్యాక్టీరియాలను పెంచాలంటే మన ఆహార అలవాట్లు కీలకం. ముఖ్యంగా హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. పీచు పదార్థాలు ఉన్న ఆహారాలే మంచి బ్యాక్టీరియాలకు ఆహారంగా పనిచేస్తాయి. పండ్లు, కూరగాయలు, ఎండు విత్తనాలు, పాలిష్ చేయని మిల్లెట్లు, సంపూర్ణ ధాన్యాలు వంటివి మంచి బ్యాక్టీరియాల పెరుగుదలకు సహాయపడతాయి.

చలికాలంలో ఇమ్మ్యూనిటి ని అమాంతం పెంచే డ్రింక్ ఇది.

అదే సమయంలో కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీములు, వైట్ షుగర్ వంటి కెమికల్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారాలను వీలైనంతవరకు తగ్గించాలి. ఇవి ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియాలను నాశనం చేసి, చెడ్డ బ్యాక్టీరియాల పెరుగుదలకు దోహదపడతాయి.

ఇంటి పెరుగు, కొబ్బరి నీళ్లు, బీన్స్ రకాలు, పులియబెట్టిన గంజి వంటి సహజ ఆహారాలు మంచి బ్యాక్టీరియాలను బాగా పెంచుతాయి. ప్రత్యేకంగా ఇంట్లో పాలు తోడేసి, ఫ్రిజ్‌లో పెట్టకుండా సహజంగా తయారైన పెరుగు తీసుకుంటే ప్రోబయోటిక్ లాభాలు మరింతగా అందుతాయి.

చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ – పటాన్‌చెరులో విషాద ఘటన.

ఇలా ఆహార అలవాట్లు మార్చుకుని, మంచి సూక్ష్మజీవులను పెంచుకుంటే ప్రేగుల గోడలు బలంగా ఉంటాయి. అప్పుడు చెడ్డ బ్యాక్టీరియాలు రక్తంలోకి ప్రవేశించకుండా శరీరం సహజంగానే అడ్డుకుంటుంది. నోట్లోనూ, ప్రేగుల్లోనూ మంచి బ్యాక్టీరియాలే బలమైన సెక్యూరిటీ ఫోర్స్‌లా పనిచేస్తాయి.

అందుకే గుండె జబ్బుల ముప్పు తగ్గాలంటే మందులతో పాటు, సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. మంచి బ్యాక్టీరియాలను పెంచే ఆహారాన్ని ఎంచుకుని, చెడ్డ అలవాట్లను దూరం పెట్టాలని అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ… నమస్కారం.

టీచర్‌తో అనుచిత సంబంధం ఆరోపణలు.. భర్తను బెదిరించిన పోలీస్ కానిస్టేబుల్.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *