High Fat High Protein Food | రక్తంలో చక్కెరను త్వరగా పెంచదు.

 High Fat High Protein Food | రక్తంలో చక్కెరను త్వరగా పెంచదు.

రక్తంలో చక్కెరను త్వరగా పెంచదు. (High Fat High Protein Food):

కొంతమందికి తరచూ ఆకలి వేయడం వల్ల ఎక్కువసార్లు తినాల్సి వస్తుంది. దీంతో షుగర్ స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి. మరోవైపు కొందరు త్వరగా భోజనం చేయడం వల్ల రాత్రి సమయానికి ఆకలి వేస్తుంది. అప్పుడు “షుగర్ తగ్గిపోతోంది” అనే భయంతో మళ్లీ ఏదో ఒకటి తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రెండు రకాల సమస్యలు ఉన్నవారికి ఇప్పుడు చెప్పబోయే డ్రై నట్స్ తీసుకునే విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. (High Fat High Protein Food)

సాధారణంగా నేను ఎండు విత్తనాలను నానబెట్టి తినాలని సూచిస్తుంటాను. కానీ త్వరగా ఆకలి రాకుండా ఉండాలి, షుగర్ ఒక్కసారిగా పెరగకూడదు, అలాగే రాత్రి లేదా అర్ధరాత్రి షుగర్ డౌన్ అయి నీరసం రాకూడదంటే — ఎండు విత్తనాలను నానబెట్టకుండా ఎండుగానే తినడం ఉత్తమం.

Hero RamCharan:రామ్ చరణ్ ఇంట్లో ప్రత్యేక బిర్యానీ విందు.. టోక్యో నుంచి వచ్చిన మాస్టర్ చెఫ్ చేతుల రుచి!

బాదం, వాల్నట్స్, పిస్తా, జీడిపప్పు, పుచ్చగింజలు, గుమ్మడ గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వంటి ఎండు విత్తనాల్లో సహజమైన హెల్దీ ఫ్యాట్స్ (అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాట్స్),( High Fat High Protein Food) అధిక ప్రోటీన్ మరియు మంచి పరిమాణంలో ఫైబర్ ఉంటాయి. చాలా విత్తనాల్లో 10 నుంచి 20 శాతం వరకు ఫైబర్ ఉంటుంది. ఈ కలయిక వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది, షుగర్ మరియు కొలెస్ట్రాల్ పెరగకుండా సహాయపడుతుంది.  

ఈ ఎండు విత్తనాల్లో ఫ్యాట్ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎండుగానే తినినప్పుడు ఇవి పొట్టలో నెమ్మదిగా విభజించబడతాయి. దీంతో ఎక్కువసేపు తృప్తిగా ఉంటుంది, మళ్లీ మళ్లీ తినాలనే కోరిక రాదు. అలాగే ఇందులో ఉన్న సహజ ఫ్యాట్స్ లెప్టిన్ అనే హార్మోన్‌ను చురుకుగా పనిచేయిస్తాయి. ఫలితంగా ఆకలి తగ్గుతుంది.

High Fat High Protein Food

మగవారు తప్పకుండా త్రాగవలసిన డ్రింక్ ఇది.

మరొక ముఖ్యమైన లాభం ఏమిటంటే — ఈ విత్తనాల్లోని ఫైబర్ గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది. అందువల్ల షుగర్ ఒక్కసారిగా పెరగదు. అదే విధంగా, మనం పొరపాటున కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నా, ఈ ఫైబర్ దానిని రక్తంలోకి వెళ్లకుండా అడ్డుకుని ప్రేగుల ద్వారా బయటకు పంపడంలో సహాయపడుతుంది.

నానబెట్టిన ఎండు విత్తనాలు త్వరగా జీర్ణమవుతాయి, పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి. కానీ ఇక్కడ మన లక్ష్యం త్వరగా ఆకలి రాకుండా ఉండటం, షుగర్ స్పైక్ కాకుండా చూడటం, రాత్రి షుగర్ డౌన్ అవకుండా కాపాడుకోవడం కాబట్టి — ఈ పరిస్థితుల్లో నానబెట్టకుండా తినడమే మంచిది. (High Fat High Protein Food)

Goat and Sheep: కీసరలో మేకలు–గొర్రెల ర*క్తం అక్రమ సేకరణ బట్టబయలు: ఇద్దరు అరెస్ట్‌, 130 ప్యాకెట్లు స్వాధీనం

డయాబెటిస్ ఉన్నవారు లేదా ఎక్కువ ఆకలితో బాధపడేవారు బాదం, వాల్నట్స్, పిస్తా, జీడిపప్పు, మెకడామియా నట్స్, పైన్ నట్స్, పుచ్చగింజలు, గుమ్మడ గింజలు వంటి ఎండు విత్తనాలను ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉండి, ఫ్యాట్ 40 నుంచి 70 శాతం వరకు ఉంటుంది. అందుకే ఇవి షుగర్ పెరగకుండా అద్భుతంగా పనిచేస్తాయి.

ప్రకృతిలో లో కార్బ్ + హై ప్రోటీన్ + హెల్దీ ఫ్యాట్ + హై ఫైబర్ ఈ నాలుగు లక్షణాలు ఒకేసారి ఉన్న ఆహారం డ్రై నట్స్ తప్ప మరొకటి లేదు.  (High Fat High Protein Food)

వాడుకునే విధానం:

  • వాల్నట్స్ – 5–6
  • బాదం – 5–6
  • పిస్తా – 8–10
  • జీడిపప్పు – 10–15
  • పుచ్చగింజలు, గుమ్మడ గింజలు, పొద్దు తిరుగుడు గింజలు – కొద్దిగా
  • ఎండు ఖర్జూరం – 1 లేదా 2 (వెగటు రాకుండా)

Body Detoxification Drink: ఒంట్లో పేరుకుపోయిన కెమికల్స్ క్లీన్ అవ్వాలంటే.

ఈ కలయికను సాయంత్రం 5 నుంచి 6:30 మధ్యలో, నానబెట్టకుండా మొత్తం 40–70 గ్రాముల వరకు తీసుకోవచ్చు. అవసరమైతే దానిమ్మ గింజలు, జామకాయ లేదా ఇతర తక్కువ షుగర్ ఉన్న ఫ్రూట్స్‌తో కలిపి తినవచ్చు.

ఇలా తీసుకుంటే జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది, గ్లూకోజ్ మెల్లగా విడుదల అవుతుంది. షుగర్ రాత్రంతా స్థిరంగా ఉంటుంది. ఆకలి పడుకునేలోపు వేయదు. మిడ్నైట్‌లో షుగర్ డౌన్ అయ్యే సమస్య కూడా ఉండదు.

Gmail: జీమెయిల్ వాడుతున్నారా..? 2026 లోఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్.

ఇంతవరకు మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ ఫైబర్, హానికరమైన కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల లివర్ మరియు షుగర్ రెండింటికీ నష్టం జరిగింది. ఇప్పుడు ఈ సహజ ఎండు విత్తనాలను ఆహారంలో భాగం చేసుకుంటే లివర్ ఆరోగ్యం మెరుగవుతుంది, గ్లూకోజ్ నియంత్రణ కూడా బాగా జరుగుతుంది.

అందుకే భోజనం తర్వాత షుగర్ 200–300కి వెళ్లి, ఫాస్టింగ్‌లో తగ్గడం లేదని బాధపడేవారు — ఈ డ్రై నట్స్ మీల్‌ను ఒకసారి ప్లాన్ చేసి చూడండి. మంచి ఫలితం తప్పక కనిపిస్తుంది. (High Fat High Protein Food)

ఎండు విత్తనాలను ఎండుగానే తినడం అనేది డయాబెటిస్ ఉన్నవారికి, రాత్రి ఆకలి వేయేవారికి, షుగర్ డౌన్ అయ్యేవారికి చాలా ప్రభావవంతమైన పద్ధతి అని చెప్పుకుంటూ…
నమస్కారం 🙏

ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? అది ఎందుకు ప్రమాదకరం?

ఆడుకున్న కుక్కే ప్రాణాలు తీసింది… రేబిస్ బారినపడి 12 ఏళ్ల బాలుడు మృతి.

నరాల బలహీనత, కాళ్లలో వణుకు, Stress అన్నిటినీ తగ్గించే బ్రహ్మాస్త్రం ఇది.

పేరులోనే ఉందా అదృష్టం? వైకుంఠ ద్వార దర్శన టోకెన్లలో ఆసక్తికర విశేషం.

బలహీనంగా ఉన్న ఎముకలు బలంగా అవ్వాలంటే…..

Lord Venkateshwara Swamy: శ్రీవారి భక్తులకు ‘ఏఐ’ ఊరట: తిరుమలలో సక్సెస్ అయిన కొత్త టెక్నాలజీ!

బియ్యం కడిగిన నీళ్లు మీ చర్మానికి వాడుతున్నారా?

సంక్రాంతికి రైతులకు గుడ్‌న్యూస్: తెలంగాణలో మళ్లీ ప్రారంభమవుతున్న రైతు యాంత్రికరణ పథకం

చలికాలంలో ఇమ్మ్యూనిటి ని అమాంతం పెంచే డ్రింక్ ఇది.

టీచర్‌తో అనుచిత సంబంధం ఆరోపణలు.. భర్తను బెదిరించిన పోలీస్ కానిస్టేబుల్.

శక్తి సామర్థ్యాన్ని తగ్గించే ఆహారం ఇది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *