Remove Fat: పుచ్చకాయ ఇలా తింటే కేజీ బరువు పెరుగుతారు:
ఈరోజు హెల్త్ టిప్ అంశంలో ప్రకృతి వైద్య విధానాన్ని ఇంట్లో ఫాలో అయ్యే వారు చాలామంది ఉన్నారు. మంచి ఆహారం తీసుకుంటే లేదా వర్కౌట్స్ చేస్తే కొవ్వు కరుగుతుందని అందరికీ తెలుసు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే… కరిగిన కొవ్వు ఎక్కడికి పోతుంది? ఒక్కసారిగా 2 కిలోలు, 4 కిలోలు తగ్గితే ఆ బరువు(Remove Fat) ఏం అవుతుంది అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
దీనిని సులభంగా అర్థమయ్యేలా ఒక ఉదాహరణ తీసుకుందాం. పొయ్యిలో పెద్ద పుల్ల మంటలో వేసితే అది మండిపోతుంది. మండే ముందు ఉన్న ఆ పుల్ల, మండిన తర్వాత ఎక్కడికి పోయింది? అది పొగగా బయటికి వెళ్లింది, కొంత బూడిదగా మిగిలింది. ఇదంతా దహన ప్రక్రియ వల్ల జరుగుతుంది.
చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగల బ్యాగ్.. మహిళ ఏం చేసిందంటే?
అదే విధంగా మన శరీరంలో కూడా కొవ్వు కరిగితే అది మాయమవదు. ఒక కిలో కొవ్వు (Remove Fat)కరిగితే అందులో 84 శాతం కార్బన్ డయాక్సైడ్‌గా శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది, మిగిలిన 16 శాతం నీటిగా బయటకు వస్తుంది. అంటే సుమారు 840 గ్రాములు కార్బన్ డయాక్సైడ్‌గా, 160 మిల్లీలీటర్ల నీటిగా బయటకు వెళ్తాయి.

ఒక కిలో కొవ్వు కరిగించాలంటే మనం సుమారు 7700 కిలోక్యాలరీల శక్తిని ఖర్చు చేయాలి. అది వ్యాయామం ద్వారా, పని ద్వారా లేదా ఆటల ద్వారా ఖర్చయితే ఒక కిలో బరువు(Remove Fat) తగ్గుతాం. అదే విధంగా 7700 కిలోక్యాలరీలు అదనంగా తీసుకుంటే ఒక కిలో కొవ్వు పెరుగుతుంది.
Knee Pains: క్యాబేజీ తో మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పొచ్చు.
కొంతమందిలో కొవ్వు కాకుండా నీటి బరువు కూడా పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఉప్పు. ఒక గ్రాము ఉప్పు శరీరంలో నిల్వ అయితే సుమారు 80 గ్రాముల నీరు కూడా నిల్వ అవుతుంది. ఉదాహరణకు, పుచ్చకాయ మీద ఎక్కువ ఉప్పు వేసుకుని తింటే పుచ్చకాయ వల్ల కాదు కానీ ఆ ఉప్పు వల్ల నీరు శరీరంలో చేరి ఉబ్బినట్టు కనిపిస్తుంది.
ఇలా సుమారు అర కిలో వరకు బరువు పెరిగినట్టు అనిపించవచ్చు. అందుకే “పుచ్చకాయ తిన్నా బరువు పెరిగిపోయింది” అనిపిస్తే, కారణం పుచ్చకాయ కాదు… దానిపై వేసిన ఉప్పు అని గుర్తుంచుకోవాలి. (Remove Fat)
MPDO Office Rent Issue:ప్రభుత్వ కార్యాలయానికే దిక్కులేదు.. అద్దె బకాయిలతో రోడ్డున పడ్డ అధికారులు.
Natural Weight Loss Foods: బరువును త్వరగా తగ్గించే ఫుడ్స్ ఇవే.