సీజన్ మారినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

సీజన్ మారినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

సీజన్ మారినప్పుడు చాలా మందికి సాధారణంగా దగ్గు, జలుబు, చర్మ ఇన్‌ఫెక్షన్లు, స్కిన్ ఇరిటేషన్లు లాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, కొన్ని సరళమైన జాగ్రత్తలు పాటిస్తే ఇవన్నీ నివారించవచ్చు.

ఈ చిన్న పనితో బ్రెయిన్ రిఫ్రెష్… బాడీలో ఫ్యాట్ దూరం.

మొదటగా, వర్షాకాలంలో నీటి పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. నీళ్లు ఏవైనా తాగకూడదు. సాధ్యమైనంతవరకు కాచిన చల్లారిన నీళ్లు లేదా శుద్ధి చేసిన మినరల్ వాటర్ తాగడం మంచిది. ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు:
ఈ సీజన్‌లో పుల్లని రసాలు తాగడం శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ముఖ్యంగా బత్తాయి జ్యూస్ చాలా ఉపయోగకరం. రోజూ ఒక గ్లాస్ బత్తాయి జ్యూస్ తాగితే శరీరానికి అవసరమైన విటమిన్ C పుష్కలంగా లభిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్‌ను కూడా పెంచి జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి రక్షిస్తుంది.

ప్రేమ వివాహం… పదేళ్ల దాంపత్యం తర్వాత భర్తనే బలి ఇచ్చిన భార్య.

అదేవిధంగా, రోజుకు నాలుగు ఐదు సార్లు తక్కువ మోతాదులో కానీ సమయానికి తినే అలవాటు పెట్టుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో తినే ఆహారం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.

ఆవిరి తీసుకోవడం ఎందుకు ముఖ్యం?
సీజన్ మారినప్పుడు రోజూ 10 నుండి 15 రోజుల పాటు ఆవిరి తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. పసుపు, తులసి ఆకులు, యూకలిప్టస్ ఆయిల్ కలిపిన ఆవిరి ఐదు నుండి పది నిమిషాలు తీసుకుంటే శ్వాసనాళాల్లోని బ్యాక్టీరియా, వైరస్‌లు చనిపోతాయి. దీనివల్ల ఇమ్యూనిటీ యాక్టివ్‌గా మారి జలుబు వంటి ఇన్ఫెక్షన్లకు అడ్డుకట్ట పడుతుంది.

నరాల సమస్య కి నేచురల్ మెడిసిన్ ఇది.

మిరియాలు, సొంటి — సహజ రక్షకులు:
ఈ సీజన్‌లో కొద్దిగా మిరియాల పొడి సాలడ్ లేదా ఫ్రూట్స్‌పై చల్లి తింటే ఇమ్యూనిటీని బలపరుస్తుంది. అలాగే ఒక చిటికెడు సొంటి పొడి మజ్జిగలో కలిపి తాగినా ఆకలి పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ రెండూ శరీరాన్ని లోపల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

నరదిష్టి ఎక్కువగా ఉందా..


వర్షాకాలం లేదా సీజన్ మారే సమయంలో ఈ చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే దగ్గు, జలుబు, చర్మ సమస్యలు దూరంగా ఉంటాయి. ఇమ్యూనిటీ బలంగా ఉండి మనం, మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా గడపగలుగుతాం. సీజన్ మారినా, మన ఆరోగ్యం మారకూడదు, జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండండి

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *