పురుషుల్లో టెస్టోస్టిరోన్ తగ్గుదలకి నేచురల్ పరిష్కారం – అత్తిపత్తి వేళ్ల పొడి ప్రయోజనాలు.

పురుషుల్లో టెస్టోస్టిరోన్ తగ్గుదలకి నేచురల్ పరిష్కారం – అత్తిపత్తి వేళ్ల పొడి ప్రయోజనాలు.

ఈ మధ్యకాలంలో సంతానలేమి సమస్యతో పాటు, ముఖ్యంగా పురుషుల్లో టెస్టోస్టిరోన్ హార్మోన్ స్థాయిలు అసమతుల్యతకు లోనవడం ఎక్కువగా కనిపిస్తోంది. టెస్టోస్టిరోన్ తగ్గితే పౌరుషం, శక్తి, బలం, ఉత్సాహం, లైంగిక సామర్థ్యం వంటి అంశాలపై నేరుగా ప్రభావం పడుతుంది. అందుకే ఈ హార్మోన్ స్థాయిలు తగ్గకుండా చూసుకోవడం, తగ్గితే నేచురల్‌గా పెంచుకునే మార్గాలు తెలుసుకోవడం చాలా అవసరం.

పురుషుల్లో టెస్టోస్టిరోన్ స్థాయిలను సహజంగా పెంచడంలో అత్తిపత్తి (Touch Me Not / Mimosa pudica) ఎంతో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. పల్లెటూర్లలో ఎక్కడపడితే అక్కడ పొదల్లా పెరిగే ఈ మొక్కను చాలామంది పట్టించుకోరు. కానీ దీనిలో ఉన్న ఔషధ గుణాలు పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

పాతాళలోకం వినడమే గానీ ఎప్పుడైనా చూశారా?వైరల్ వీడియోలో బోరుబావి సాహసం.

అత్తిపత్తి మొక్కలో ముఖ్యంగా వేళ్లు చాలా ప్రయోజనకరమైనవి. వాటిని శుభ్రంగా కడిగి, ఎండబెట్టి, పొడిగా చేసుకుని ఇంట్లో భద్రపరుచుకోవాలి.
వాడే విధానం ఇలా ఉంటుంది:

  • ఉదయం ఒకటిన్నర టీ స్పూన్
  • సాయంత్రం ఒక టీ స్పూన్
    మొత్తం రోజుకు సుమారు 18 గ్రాములు.

ఈ పొడిని నీటిలో వేసి మరిగించి వడకట్టి కషాయం (డికాక్షన్)గా తాగవచ్చు. లేదా అత్తిపత్తి వేళ్ల పొడిని తేనెతో కలిపి నేరుగా కూడా తీసుకోవచ్చు.

డైలీ కాఫీ త్రాగే వారికి పెను ప్రమాదం!

శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, ఇలా రెండు పూటలుగా క్రమం తప్పకుండా వాడితే 12 రోజుల్లోనే టెస్టోస్టిరోన్ హార్మోన్ స్థాయిలు 20–25 శాతం వరకు పెరుగుతాయి. అంతేకాదు, పురుషుల్లో లైంగిక సామర్థ్యం సుమారు 37 శాతం వరకు మెరుగుపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

యువతలో కొత్త రిలేషన్ ట్రెండ్ – ‘హుష్ డేటింగ్’ అంటే ఏమిటి?

ఈ రోజుల్లో డయాబెటిస్, హార్మోన్ల లోపం, ఊబకాయం వంటి కారణాల వల్ల కొత్తగా పెళ్లైన యువకుల్లో కూడా లైంగిక సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటి వారికి అత్తిపత్తి వేళ్ల పొడి రెండు విధాలుగా లాభం చేకూరుస్తుంది: హార్మోన్ సమతుల్యతను మెరుగుపరచడం, శారీరక శక్తిని పెంచడం.

మన ఋషులు శతాబ్దాల క్రితమే ఇలాంటి సహజ ఔషధాలను కనుగొని మనకు అందించారు. నేడు వాటిని శాస్త్రీయ ఆధారాలతో మళ్లీ గుర్తుచేస్తేనే మనం నమ్ముతున్నాం. కాబట్టి ఈ సహజ చిట్కాను సరిగ్గా వినియోగించుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం మన చేతుల్లోనే ఉంది.

దోమలు మీ దరి చేరకుండా చేసే 5 రకాల మొక్కలు ఇవే.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *