మ్యాన్‌ఫోర్స్ తీసుకున్న తరువాత శరీరంలో జరిగే 7 ముఖ్యమైన మార్పులు ఎంటో తెలుసా:
మ్యాన్‌ఫోర్స్ (Manforce)టాబ్లెట్ తీసుకున్న తరువాత ముఖ్యంగా శరీరంలో జరిగే 7 మార్పు లు ఎంటో తెలుసుకుందాం.
1.లైంగిక పనితీరును మెరుగుపరచడం
ఈ ఔషధం (Manforce) లైంగిక ప్రేరణ మరియు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగితే, పురుషాంగం రక్తంతో నింపబడుతుంది, తద్వారా అంగస్తంభన ఎక్కువ కాలం కొనసాగుతుంది. దీని ఫలితంగా లైంగిక కార్యకలాపాలు మెరుగుపడుతాయి.
2.నొప్పి లేదా కండరాల తిమ్మిరి
కొన్ని కొన్ని సందర్భాల్లో, మ్యాన్‌ఫోర్స్ (Manforce) టాబ్లెట్ తీసుకోవడం వలన కండరాల తిమ్మిరి లేదా నొప్పికి గురి అవ్వవచ్చు. ఔషధ ప్రభావం తగ్గిన తరువాత కండరాల నొప్పి లేదా తిమ్మిరి మాయం అవుతుంది.
3.దృష్టిలో తేలికపాటి మార్పులు
మ్యాన్‌ఫోర్స్(Manforce) తీసుకున్న తర్వాత కొంతమందికి దృష్టిలో స్వల్ప మార్పులు కనిపించవచ్చు. ఉదాహరణకు, కళ్ళలో లేత నీలం రంగు లేదా అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలు ఉండవచ్చు. ఈ ప్రభావం సాధారణంగా తాత్కాలికంగా ఉంటుంది మరియు ఔషధం యొక్క ప్రభావం తగ్గిన తర్వాత ఈ లక్షణాలు అదృశ్యమవుతాయి.
4.రక్త ప్రసరణను మెరుగుపరచడం
మ్యాన్‌ఫోర్స్ టాబ్లెట్ (Manforce) తీసుకోవడం వలన శరీరంలో ముఖ్యంగా పురుషాంగంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మ్యాన్‌ఫోర్స్ రక్త నాళాలను విస్తరించేందుకు పనిచేస్తుంది, తద్వారా రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. ముఖ్యంగా లైంగిక ప్రేరణ సమయంలో శాశ్వత మరియు బలమైన అంగస్తంభనను కలిగిస్తుంది.
5.చర్మం ఎర్రబడటం
మ్యాన్‌ఫోర్స్ (Manforce)తీసుకోవడం వల్ల శరీరంలో రక్తనాళాల విస్తరణ పెరిగి ముఖం మరియు మెడ వంటి శరీర భాగాలలో చర్మం ఎర్రబడటానికి కారణమవుతుంది. ఇలా చర్మంలో మార్పులు సాధారణంగా తాత్కాలికంగా ఉంటుంది మరియు ఔషధం ప్రభావం తగ్గిన తర్వాత మాయమవుతుంది.
6.కడుపులో అసౌకర్యం మరియు అజీర్ణం
ఈ ఔషధం కడుపుపై ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా ఖాళీ కడుపుతో మ్యాన్‌ఫోర్స్ (Manforce) తీసుకోవడం వలన కొంతమందికి కడుపులో తేలికపాటి అసౌకర్యం లేదా అజీర్ణం అనుభవించవచ్చు.
7.తలనొప్పి మరియు మైకము
సిల్డెనాఫిల్ మెదడు మరియు రక్త నాళాలపై ప్రభావం చూపించడంతో, ఇది తలనొప్పి మరియు మైకము కలిగించవచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb