Monalisa: మొదటి సినిమాకు సంతకం చేసిన మోనాలిసా.
ప్రస్తుతం మోనాలిసా(Monalisa) అంటే చాలు ఎవరైనా సరే కుంభమేళా స్టార్ అంటారు. అయితే ఈమె ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతోన్న మహా కుంభమేళాలో తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చిన విషయం తేలిసినదే. కుంభమేళా కు వచ్చిన కొందరు యూట్యూబర్లు ఆమె ఫొటోలు మరియు వీడియోలు తీసి నెట్టింట వైరల్ చేసేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది మోనాలిసా. నెట్టింట ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, వార్తలే కనిపించాయి.
కొన్ని గంటల వ్యవధీలోనే స్టార్ అయిన మోనాలిసా(Monalisa)కు తన తర్వాతి సినిమా లో ఛాన్స్ ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించాడు.ఇక కుంభమేలా లో ఆమె అభిమానులు వెంటాడడంతో మోనాలిసా వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది.వారి వ్యాపారం తగ్గిపోవడం తో ఆమె తండ్రి నిర్ణయం తీసుకుని, మోనాలిసాను అక్కడ నుంచి తిరిగి ఇంటికి పంపించేశారు.కానీ, అప్పటికే ఆమె వీడియోలు,ఫొటోలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ మారాయి. తన వీడియోస్ వైరల్ అవ్వడం తో ఎక్కడ చూసిన తన పేరు మార్మోగిపోయింది.
మోనాలిసా(Monalisa) కు బాలీవుడ్ మూవీ లో నటించే ఆఫర్ వచ్చింది. తాజాగా ఆమె తన మొదటి చిత్రానికి సంతకం చేసింది.దర్శకుడు సనోజ్ మిశ్రా (Sanoj Mishra) కుంభమేళా స్టార్ మోనాలిసా కు ది డైరీ ఆఫ్ మణిపూర్’ (The Diary of Manipur) చిత్రంలో ఛాన్స్ ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.దర్శకుడు సనోజ్ మిశ్రా (Sanoj Mishra) స్వయంగా మోనాలిసా ఇంటికి వెళ్లారు. తాను ఆఫర్ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు. ఇక చిత్రీకరణకు ముందు ముంబైలో మోనాలిసాకు యాక్టింగ్ నేర్పించనున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb