డైలీ కాఫీ త్రాగే వారికి పెను ప్రమాదం!

డైలీ కాఫీ త్రాగే వారికి పెను ప్రమాదం!

కాఫీ తాగే అలవాటు మొదట్లో చిన్న సరదాగా మొదలైనా, కొన్ని రోజులు గడిచేసరికి అది వ్యసనంగా మారిపోతుంది. చాలామందికి కాఫీ తాగకపోతే రోజంతా పనులు సరిగా జరగవు. అలాంటి పరిస్థితిలోనే జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, గాయాలు లేదా ఆపరేషన్ల సమయంలో మనం యాంటీబయోటిక్స్ వాడుతుంటాం. కానీ యాంటీబయోటిక్స్ తీసుకుంటూనే కాఫీ తాగడం చాలా ప్రమాదకరమని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

యాంటీబయోటిక్స్ వాడుతున్న రోజుల్లో కూడా కాఫీ తాగితే, ఆ కాఫీలోని కెఫిన్ ఇన్ఫెక్షన్‌కు కారణమైన బ్యాక్టీరియాలకు బలాన్ని ఇస్తుందని జర్మనీ శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా రుజువు చేశారు. దాంతో యాంటీబయోటిక్స్ ప్రభావం తగ్గిపోతుంది. డోస్ పెంచినా, మందు మార్చినా ఫలితం ఆశించినంతగా ఉండదు. చివరికి బ్యాక్టీరియాలు మందులకు అలవాటు పడి, మరింత బలంగా మారతాయి.

యువతలో కొత్త రిలేషన్ ట్రెండ్ – ‘హుష్ డేటింగ్’ అంటే ఏమిటి?

అందుకే యాంటీబయోటిక్స్ వాడుతున్న సమయంలో కాఫీ ఎందుకు తాగకూడదు? ఆ రోజుల్లో దానికి బదులుగా ఏం తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది నర్వ్ స్టిములెంట్. కాఫీ తాగిన వెంటనే మనకు హుషారు రావడం, అలసట తగ్గినట్టు అనిపించడం, మెదడు చురుగ్గా పనిచేయడం ఇవి కెఫిన్ ప్రభావమే. దీనివల్ల మెదడులో డోపమిన్ అనే ‘హ్యాపీ హార్మోన్’ విడుదల అవుతుంది. దాంతో మనకు ఎనర్జీ వచ్చినట్టుగా, ఉత్సాహంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది.

కానీ ఈ ప్రభావం గంటన్నర నుంచి రెండు గంటల వరకే ఉంటుంది. ఆ తర్వాత కెఫిన్ ప్రభావం తగ్గిపోతుంది. డోపమిన్ స్థాయి ఒక్కసారిగా పడిపోతుంది. అప్పుడే అలసట, తలనొప్పి, డల్లుగా ఉండటం, మైండ్ పనిచేయనట్టు అనిపించడం మొదలవుతాయి. మళ్లీ అదే ఉత్సాహం రావాలంటే కాఫీ కావాలనే కోరిక పెరుగుతుంది. అలా కాఫీ తాగడం ఒక వ్యసనంగా మారిపోతుంది.

యాలుకుపొడి – హై బీపీ తగ్గించడంలో సహజమైన అద్భుతం.

సిగరెట్, మద్యం, గుట్కా ఎలా వ్యసనంగా మారుతాయో… కాఫీలోని కెఫిన్ కూడా అలాగే ఎడిక్షన్‌కు దారి తీస్తుంది.

ఇప్పుడు అసలు కీలకమైన విషయం ఏంటంటే—యాంటీబయోటిక్స్ వాడుతున్న సమయంలో ఈ కెఫిన్ బ్యాక్టీరియాలపై ప్రభావం చూపుతుంది. కెఫిన్ బ్యాక్టీరియాల్లో ఉన్న ‘Rob’ అనే జీన్‌ను యాక్టివేట్ చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ జీన్ యాక్టివ్ అయినప్పుడు బ్యాక్టీరియాలకు యాంటీబయోటిక్స్‌ను తట్టుకునే శక్తి మూడు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుంది. ఫలితంగా యాంటీబయోటిక్స్ పనిచేయకుండా పోతాయి.

మందు పని చేయట్లేదని డోస్ పెంచినా, వేరే యాంటీబయోటిక్ ఇచ్చినా బ్యాక్టీరియాలు వాటికీ అలవాటు పడిపోతాయి. దీనినే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటారు. ఈ విషయాన్ని జర్మనీ దేశంలోని వుర్జ్‌బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా నిరూపించారు.

 గూగుల్‌ క్రోమ్‌ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!

అందుకే రోజూ కాఫీ తాగే వారు—ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు యాంటీబయోటిక్స్ వాడుతున్న రోజుల్లో తప్పనిసరిగా కాఫీని పూర్తిగా మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో మందులే పని చేయని ప్రమాదకర పరిస్థితి రావచ్చు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే విషయంపై హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న కొన్ని ముఖ్యమైన యాంటీబయోటిక్స్‌కు కూడా బ్యాక్టీరియాలు రెసిస్టెంట్‌గా మారితే భవిష్యత్తు చాలా భయంకరంగా మారుతుందని చెబుతోంది.

దోమలు మీ దరి చేరకుండా చేసే 5 రకాల మొక్కలు ఇవే.

ఇది పూర్వకాలంలో డీడీటీ దోమల మందు కథలాంటిదే. మొదట బాగా పనిచేసిన డీడీటీకి దోమలు అలవాటు పడి, చివరికి అది పనిచేయకపోవడంతో పూర్తిగా నిషేధించారు. అలాగే మన శరీరంలోనూ బ్యాక్టీరియాలు మందులకు అలవాటు పడితే పరిస్థితి ప్రమాదకరం అవుతుంది.

అయితే యాంటీబయోటిక్స్ వాడే రోజుల్లో కాఫీకి బదులుగా ఏం తీసుకోవాలి?

కాఫీ ఫ్లేవర్ కావాలనుకునే వాళ్లకు ఒక సహజ ప్రత్యామ్నాయం ఉంది. నాచురోపతీ పద్ధతిలో కాబూలీ శెనగల కాఫీ చాలా మంచిది. కాబూలీ శెనగలను బాండీలో వేసి మెల్లగా 20–25 నిమిషాలు వేయించి, తర్వాత పొడి చేసి వాడవచ్చు. ఇది చూడటానికి, వాసనకు, రుచికి కాఫీ లాగే ఉంటుంది. పాలలో కలిపి తాగితే కాఫీ తాగిన అనుభూతి కలుగుతుంది. కానీ ఇది బ్యాక్టీరియాలపై చెడు ప్రభావం చూపదు.

ప్రేమ వివాహం… పదేళ్ల దాంపత్యం తర్వాత భర్తనే బలి ఇచ్చిన భార్య.

అలాగే గ్రీన్ టీ, హెర్బల్ టీ, లెమన్ గ్రాస్ టీ, అల్లం టీ లాంటి పానీయాలు కూడా మంచి ప్రత్యామ్నాయాలు. ఇవి శరీరానికి హాని చేయకుండా స్వల్ప ఉత్సాహాన్ని ఇస్తాయి.యాంటీబయోటిక్స్ కోర్స్ ఉన్న నాలుగు, ఐదు, ఏడు లేదా పది రోజులు కాఫీకి పూర్తిగా దూరంగా ఉండి ఈ ప్రత్యామ్నాయాలను అలవాటు చేసుకుంటే చాలా మంచిది.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాఫీ లాంటి చిన్న అలవాటు వల్ల భవిష్యత్తులో మందులే పని చేయని పరిస్థితి రాకుండా ఇప్పుడే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అందరూ ఆలోచించి పాటిస్తారని ఆశిస్తూ నమస్కారం.

హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గి గుండె ఆరోగ్యం పెరగాలంటే….

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *