Natural Weight Loss Foods: బరువును త్వరగా తగ్గించే ఫుడ్స్ ఇవే.

Natural Weight Loss Foods: బరువును త్వరగా తగ్గించే ఫుడ్స్ ఇవే.

Natural Weight Loss Foods: బరువును త్వరగా తగ్గించే ఫుడ్స్ ఇవే.

ఊబకాయం నుంచి బయటపడాలని, త్వరగా వెయిట్ లాస్–ఫ్యాట్ లాస్ కావాలని అనుకునే వారికి రా ఫుడ్ (నాచురల్ ఫుడ్) అత్యుత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఉడికిన ఆహారాలతో పోలిస్తే వండకుండా, పొయ్యి మీద పెట్టకుండా తినే ఫ్రెష్ నాచురల్ ఫుడ్స్ వల్ల బరువు వేగంగా తగ్గుతుందన్నది అనుభవంతో నిరూపితమైన విషయం. పచ్చి కూరగాయలు, సాలడ్స్, మొలకలు, పచ్చి విత్తనాలు, ఫ్రెష్ ఫ్రూట్స్, స్వీట్ కార్న్, పచ్చి బటానీలు, శెనగలు, కందులు, పచ్చికొబ్బరి, వేరుశనగలు (Natural Weight Loss Foods)వంటి ఆహారాలు ఇందులోకి వస్తాయి.

చలికాలంలో ఆరోగ్యం: ఒంట్లో రక్తాన్ని, వేడిని పెంచే చిట్కాలు.

ఈ రా ఫుడ్స్ ప్రత్యేకత ఏంటంటే—ఇవిలోని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ అన్నీ సహజ స్థితిలో ఉంటాయి. ఇవి శరీరంలో నిదానంగా అరుగుతాయి. ఫలితంగా గ్లూకోజ్ ఒక్కసారిగా రక్తంలోకి వెళ్లకుండా, దశలవారీగా స్లోగా రిలీజ్ అవుతుంది. ఫైబర్ “స్పీడ్ బ్రేకర్”లా పనిచేసి షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటుంది. దీంతో లివర్ గ్లూకోజ్‌ను ఫ్యాట్‌గా మార్చే అవకాశం తగ్గి, బరువు పెరగదు.

Gandham Podi:డల్ గా వాడిపోయిన ముఖాన్ని మెరిసేలా చేసే ప్యాక్ ఇది.  

ఉడికిన, వేయించిన ఆహారాల్లో మాత్రం కార్బోహైడ్రేట్స్ ముందే బ్రేక్ డౌన్ అయిపోతాయి. అందుకే అవి వేగంగా గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి వెళ్లి షుగర్ పెంచుతాయి. ఉదాహరణకు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే షుగర్ వెంటనే పెరుగుతుంది. అదే బంగాళదుంపను ఉడకబెట్టి లేదా పచ్చిగా తింటే అరుగుదల స్లోగా జరుగుతుంది. దీనిని నడక–జాగింగ్–రన్నింగ్ ఉదాహరణతో పోల్చవచ్చు. వేయించిన ఆహారం రన్నింగ్‌లా, ఉడికినది జాగింగ్‌లా, రా ఫుడ్(Natural Weight Loss Foods) నడకలా నెమ్మదిగా శరీరంలో పనిచేస్తుంది.

Natural Weight Loss Foods

అందుకే రా ఫుడ్స్ వెయిట్ పెంచవు. ఇప్పటికే పెరిగిన బరువును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఆశ్రమాల్లో, డైట్ ప్రోగ్రామ్స్‌లో రా ఫుడ్ తీసుకునేవారికి నెలకు 10–11 కిలోల వరకు బరువు తగ్గిన ఉదాహరణలు ఉన్నాయి. అదే ఉడికిన ఆహారాలతో ఉన్నవారికి 7–8 కిలోల వరకు మాత్రమే తగ్గుతుంది.

Anil Ravipudi: డ్రైవర్ కొడుకు టాప్ డైరెక్టర్ గా ఎలా ఎదిగాడు?

రోజువారీ డైట్‌గా ఉదయం స్ప్రౌట్స్ (పెసలు, శెనగలు, బొబ్బర్లు)తో పాటు జామకాయ, బొప్పాయి, కర్బూజ, రేగుపండ్లు లాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మధ్యాహ్నం వెజిటబుల్ సాలడ్‌లో స్వీట్ కార్న్ గింజలు, దానిమ్మ గింజలు (Natural Weight Loss Foods)కలుపుకొని తినాలి. మిరియాల పొడి, జీలకర్ర పొడి చల్లుకుంటే సులభంగా తినగలుగుతారు. సాయంత్రం బాదం, పిస్తా, వాల్నట్స్, గుమ్మడికాయ గింజలు, పుచ్చగింజలు వంటి ఎండు విత్తనాలు, ఖర్జూరాలు, ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. ఈ ఆహారం సాయంత్రం 7 గంటలలోపే తీసుకోవడం మంచిది.

ఈ విధంగా మూడు పూట్ల నాచురల్ రా ఫుడ్ తీసుకుంటే నీరసం రాకుండా, శరీరానికి కావలసిన ప్రోటీన్, పోషకాలు అందుతాయి. హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. పీసీఓడీ, బీపీ, షుగర్ వంటి సమస్యలు తగ్గుతూ బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రకృతి ఇచ్చిన ఈ రా ఫుడ్ డైట్ ప్లాన్ ఆరోగ్యకరంగా, సురక్షితంగా వెయిట్ లాస్ (Natural Weight Loss Foods)కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఇమ్మ్యూనిటి ని పెంచే Antioxidant రిచ్ ఫుడ్స్ ఇవే

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *